Zodiac Signs : మాలవ్య రాజయోగం రాబోతుంది… ఈ రాశులకు ఎన్నడు చూడని ధనయోగం కలగబోతుంది…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : మాలవ్య రాజయోగం రాబోతుంది... ఈ రాశులకు ఎన్నడు చూడని ధనయోగం కలగబోతుంది...?
Zodiac Signs : మనకి తప్పు,ఒప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుటకు Zodiac Signs ఈ నవగ్రహాలు కీలక పాత్రను పోషిస్తాయి. మన జీవితంలో పాపాలు ఎక్కువ చేయొద్దు. పాపాలు చేయటం వలన చెడు ప్రభావాలు. పుణ్యం చేయడం వలన మంచి ప్రభావాలు ఈ నవగ్రహాలు కలుగజేస్తాయి. అటువంటి నవగ్రహాలలో కీలక గ్రహమైన గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు సంపదలకు,అందానికి, విలాసవంతమైన జీవితానికి, ఆరోగ్యానికి ముఖ్యకారకుడు. శుక్రుడు జీవితంలోకి వచ్చినప్పుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అందరికీ కలిసి వస్తుంది. ప్రత్యేకమైన యోగ ఫలాలను కూడా శుక్రుడు ఏర్పరుస్తుంటాడు. అయితే 2025 కొత్త సంవత్సరంలో ఈనెల 28వ తేదీన శుక్రుడు రాశి సంచారం చేయటంతో మాలవ్య రాజయోగం ఏర్పడబోతుంది. ఈ శుక్రుడు సంచారం వలన ఎన్ని రాశులకు కలిసి వస్తుంది అంటే, మూడు రాశులకు మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఏ ఏ రాశులు మాలవ్య రాజయోగానికి పొందవచ్చునో తెలుసుకుందాం…

Zodiac Signs : మాలవ్య రాజయోగం రాబోతుంది… ఈ రాశులకు ఎన్నడు చూడని ధనయోగం కలగబోతుంది…?
Zodiac Signs వృషభ రాశి
గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ చేయటంతోపాటు శుక్రుని పూజించాలి. మీ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈ శుక్రుడు. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. పనిచేసిన అద్భుతమైన విజయాలను అందుకుంటారు. వీరి సంపాదన ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు ఏ పని చేసినా సరే దానికంటే పది రెట్లు ఫలితాలను అందుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కుటుంబంలో ఇకపై ఉండవు.అన్ని సర్దుమనిగిపోతాయి. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తలు వహించాలి.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి శుక్రుని యొక్క దీవెన ఉండుటవలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి,ఈ సంవత్సరంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఈ సంవత్సరం ఇక్కట్లు అన్ని తప్పి పోతాయి. ఆర్థిక పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. సంపదను జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే రాబోయే కాలంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవసరమైన ఖర్చులను నియంత్రించడంలో మీ చేతుల్లోనే ఉంది.
కుంభరాశి : కుంభ రాశి వారికి వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగిపోయి సంపాదనలో ఉన్నత స్థాయికి చేరుతారు. ఈ కుంభ రాశి వారికి మాలవ్య రాజయోగం వల్ల అదృష్టం త్రివ్ర స్థాయిలో రెట్టింపు అవుతుంది. వ్యాపారాలన్నీ కూడా లాభ స్థానంలోనే ఉంటాయి. మీరు ఏ పని చేసినా సరే అన్నింట విజయం మీదే ఉంటుంది. దీర్ఘకాలoగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కావున కుంభ రాశి వారు గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ.శుక్రుని,బృహస్పతిని పూజించాలి. ఎదుటివారు డబ్బు ఇస్తారని ఆశతో ఎదురు చూడకుండా భగవంతునిపై నమ్మకం ఉంచి కష్టపడాల్సి ఉంటుంది అని. జ్యోతిష్య పండితులు తెలియజేశారు.