Ravana Death : రావణుడు చనిపోయాక.. ఆయన భార్య మండోదరి ఏం చేసిందో తెలుసా?
Ravana Death : రామాయణంలో రాముడి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి రావణాసూరుడు. ఆయన్నే రావణుడు అని కూడా అంటారు. రావణుడు అనే వ్యక్తే లేకపోతే అసలు రామాయణమే లేదు. రావణుడు విద్యావంతుడు.. చాలా తెలివి కలవాడు. మేధా సంపత్తి కలవాడు. రావణుడి భార్య మండోదరి కూడా మహా పతివ్రత. తను మయ బ్రహ్మకూతురు.రావణుడు.. ఆమెను మోహించి వివాహం చేసుకుంటాడు. వీళ్లకు ఇంద్రజిత్తు అనే కొడుకు ఉన్నాడు. అయితే.. తను తన భర్తను చాలా ప్రేమించేది. తన భర్త చనిపోయాడనే వార్త తనకు తెలిసింది.
నిజానికి.. రావణుడు.. సీతను ఎత్తుకొని వచ్చినప్పటి నుంచి తను రావణుడిని హెచ్చరిస్తూనే ఉంది కానీ.. రావణుడు మండోదరి మాట వినలేదు.నిజానికి.. తమ భర్త చనిపోతే.. ఏ భార్య అయినా తీవ్రస్థాయిలో బాధపడుతుంది. తన భర్తను చంపిన వారిపై తీవ్రమైన కోపాన్ని చూపిస్తుంది. కానీ.. మండోదరి మాత్రం తన భర్తను చంపిన రాముడిపై ఏమాత్రం కోపం చూపించలేదు.రావణుడిని రాముడు చంపిన తర్వాత కొద్ది దూరంలో ఓ చెట్టుకింద లక్ష్మణుడితో కలిసి నిలబడతాడు. రాముడే తన భర్తను చంపాడని తెలిసినా..
Ravana Death : రావణుడి మృతదేహాన్ని చూసి మండోదరి ఏం మాట్లాడిందంతే?
మండోదరి మాత్రం రాముడిపై ఏమాత్రం కోపం చూపించదు.తన భర్త మృతదేహం దగ్గరికి వెళ్లి.. ఏం మాట్లాడిందో తెలుసా? నువ్వు తపస్సు చేసినప్పుడు నీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నావు. నీ కోరికలను అన్నింటినీ జయించావు. కానీ.. ఎప్పుడైతే సీతమ్మను చూశావో.. నీ ఇంద్రియాలు మొత్తం అదుపుతప్పాయి.
కానీ.. నీకు నాలో లేని అందం తనలో ఏం కనబడింది. నువ్వు నీ ఇంద్రియాలను, కోరికలను నియంత్రణలో ఉంచుకోలేకపోయావు. దాని వల్లనే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను చంపింది రాముడు కాదు. నీ ఇంద్రియాలు. అవును.. నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి.. అంటూ రావణుడి శరీరం చూసి వాపోయింది మండోదరి.