Mukkoti Ekadashi Pooja : డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి.. సంపూర్ణ పూజ విధానం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mukkoti Ekadashi Pooja : డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి.. సంపూర్ణ పూజ విధానం…!

 Authored By jyothi | The Telugu News | Updated on :21 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Mukkoti Ekadashi Pooja : డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి.. సంపూర్ణ పూజ విధానం...!

Mukkoti Ekadashi Pooja : 2023 డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశి పూజ సమయం నైవేద్యం ఏ ఏకాదశికి ఉండలేకపోయినా కానీ ఈ ఒక్కరోజు ఉంటే అన్ని రోజులు ఉన్న ఫలితం దక్కుతుంది. సంపూర్ణ పూజ విధానం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతూ ఉంటారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసింది అని అర్థం. వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుని యొక్క విశ్వాసం. అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే కనుక డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు దశమి ఉదయం తొమ్మిది గంటల 38 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం ఏడు గంటల 56 నిమిషాల వరకు ఉంది. అయితే వాస్తవానికి సూర్యోదయానికి తిధి పరిగణంలోకి తీసుకోవాలి. కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23 శనివారం రోజు వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి ఘడియలు దాటిపోక ముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం.

లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిధి ఉంది. కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం డిసెంబర్ 23 శనివారం 8 గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వారు మాత్రం డిసెంబర్ 23 శనివారం నియమాలు పాటించాల్సి ఉంటుంది. తల స్నానం చేసి తెలుపు పట్టు వస్త్రాలు ధరించి పూజకు విష్ణుమూర్తి ఫోటోను సిద్ధం చేసుకోవాలి. పసుపు అక్షతలు, తామర పువ్వులు, తులసి దళములు, నైవిద్యానికి పాయసం, రవ్వ లడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి పూజ చేసుకోవచ్చు. పూజకు విష్ణు అష్టోత్తరం శ్రీమన్నారాయణ స్తోత్రం విష్ణుపురాణం దశావతారంలో పారాయణ చేయాలి. ముఖ్యంగా మీ యొక్క పూజా మందిరంలో స్థలం కనుక ఉన్నట్లయితే ఒక పీఠం వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టుకోవాలి. మీరు ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని ఒక పసుపు పచ్చటి వస్త్రాన్ని అక్కడ పరిచి బియ్యంపిండితో పద్మముగ్గు వేసుకొని ఆ పద్మములో పసుపు కుంకుమతో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు అక్కడ పెట్టుకోవాలి. అలాగే పసుపు, కుంకుమలతో గంధంతో స్వామివారిని అలంకరించుకోవాలి. అలాగే తమలపాకులు పెట్టి ఆ యొక్క తమలపాకులో ప్రమిదలు పెట్టుకోవాలి.

ఎప్పుడూ చేసే విధంగా మీరు ఇత్తడి ప్రమిదలు కాకుండా బియ్యపు పిండితో ప్రమిదలు చేసి పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు వెంకటేశ్వర దేవాలయాలను దర్శించుకోవడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. పంచ హారతికి ఆవూ నే దీపారాధనకు కొబ్బరి నూనెను వాడాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు 108 మారులు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజ చేసేటప్పుడు తులసి మాల ధరించి తూర్పు వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఉపవాసం ఉంటే కనుక మిగిలిన రోజులు అన్నీ కూడా ఉపవాసం ఉండలేని వారు ఈరోజు ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ కలుగుతుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది