Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశికి అంటే ఏమిటి..? అసలు ఆ పేరు ఎలా వచ్చింది..!
ప్రధానాంశాలు:
Vaikuntha Ekadashi:వైకుంఠ ఏకాదశికి ఆలయాలలో ఎందుకంత భక్తుల రద్దీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చింది..!
Vaikuntha Ekadashi : వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర Vaikuntha Ekadashi పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులకు నమ్మకం ఉంటుంది. అందుకే వైకుంఠ ఏకాదశిVaikuntha Ekadashi పుణ్య రోజున భక్తులు వైష్ణవ దేవాలయాలకు తరలివెళ్తుంటారు. ఇందులో భాగంగానే తిరుమల Tirumala లో శ్రీవారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే.. ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహావిష్ణువును ప్రార్థిస్తారు. ఈ నేపథ్యంలో మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు.
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశికి అంటే ఏమిటి..? అసలు ఆ పేరు ఎలా వచ్చింది..!
Vaikuntha Ekadashi: పేరు ఎలా వచ్చిందంటే..
దీంతో స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. అనంతరం ఏం వరం కావాలో కోరుకోవాలని అడుగుతాడు మహా విష్ణువు. దీనికి ఆమె ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని కోరుకుంటుంది. దీంతో స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలా వైకుంఠ ఏకాదశిగా మారిందని చెబుతుంటారు. బ్రహ్మకాలంలోనే లేచి స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి వైష్ణవాలయాలకు వెళ్లాలి. రోజంతా ఉపవాసం fasting ఉండి స్వామి నామస్మరణం చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని అంటున్నారు.కలియుగ దైవం కొలువైన తిరుమలకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండల వాడు కొలువైన తిరుమలపై ఇసుక వేస్తె నేల రాలదు అన్న చందంగా భక్తుల రద్దీ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారు ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. 1980, 1990లలో లయ అధికారులు వైకుంఠ ద్వాదశిని అదనపు పవిత్రమైన రోజుగా గుర్తించడం ద్వారా ఉత్సవాలను పొడిగించారు. మకర సంక్రాంతి పండుగకు ముందు రెండు రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. తిరుమలలో వేంకటేశ్వరునిగా పూజలందుకుంటున్న శ్రీ మహా విష్ణువు ఈ సమయంలో తనను దర్శించుకున్న వారికి స్వర్గలోకం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై, మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి MUKKOTI EKADASHI 2025 అని పేరు వచ్చిందని అష్టాదశ పురాణాల ద్వారా తెలుస్తోంది.