నాగదోషం అంటే ఏమిటి.. నాగదోషం ఎవరికి… దోష నివారణ ఎలా చేసుకోవాలి..?
naga dosham సాధారణంగా జ్యోతిష్యం పై కొంచెం అవగాహన ఉన్నవారు లేదా జ్యోతిషులను సంప్రదించేవారికి నాగదోషం, కాలసర్పదోషం అనే పదాలు పరిచయం ఉంటాయి. అసలు ఈ దోషాలు అంటే ఏమిటి ? వివరంగా తెలుసుకుందాం..
జాతకము నందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బంధించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉన్న, పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. “కాల సర్పదోషం”(నాగదోషం) ఉంది అని పండితుల చెప్తారు.
ఏం నష్టం ?
కాలసర్పదోషం …ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాధలు పడుతారు. జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది.
naga dosham నాగదోషం ఎవరికి ఉంటుంది ?
జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.
జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.
జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.
జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి.సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.
naga dosham దోష నివారణకు ఏం చేయాలి ?
నాగదోష naga dosham నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు. పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది.