Nagula Chavithi : నాగుల చవితి నాడు పాలు పోసే సమయం… పుట్ట దగ్గర చేయవలసిన ఆరాధన..!
Nagula Chavithi : ఈ మాసంలో 29 శనివారం నాడు నాగుల చవితి జరుపుకొనున్నారు. ఈ నాగుల చవితి నాడు పాలు పోసే సమయం పుట్ట దగ్గర చేయవలసిన పూజలు ఆరాధన ప్రార్ధన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తేదీలు, మిగులు, తగులు రావడంతో నాగుల చవితి విషయంలో కొంత గజిబిజి ఉన్నది. శుక్రవారం రోజు చేసుకోవాల్సిన పూజ శనివారం చేయవలసి వచ్చింది. శనివారం సూర్యోదయానికి చవితి తిధి ఉంది కావున శనివారమే పుట్టలో పాలు పోయాలి. అని అంటున్నారు ఇంకొందరు మరి సమితి తిధి ఎప్పటి నుంచి ఏ సమయం వరకు ఉందో చూస్తే అక్టోబర్ 28 శుక్రవారం తదియ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు ఉన్నదని కొందరు అంటున్నారు.
అక్టోబర్ 29 శనివారం ఉదయం 10 23 నిమిషాల వరకు చవితి గడియలు ఉన్నవి.. నిజానికి రాత్రి సమయంలో చేసే పండుగలు కార్తీక పౌర్ణమి అట్లతదియ దీపావళి అయితే రాత్రి తేదీ రావడం ముఖ్యం మిగిలిన అన్ని పండుగలు సూర్యోదయానికి తేదీ ఉండడమే లెక్క అంటున్నారు. అయితే ఇటీవల లో జరుపుకున్న దీపావళి అదేవిధంగా జరుపుకున్నాం. సూర్యోదయానికి చతుర్దతి తేదీ సూర్య అస్తమయానికి అమావాస్య తేదీ ఉండడంతో నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఒకే నాడు జరుపుకున్నాం.. అదేవిధంగా నాగుల చవితి సూర్యోదయానికి తేదీ ముఖ్యం కావున శనివారమే నాగుల చవితి చేసుకోవడంలో ఎటువంటి అనుమానం లేదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
సహజంగా ఉదయం టైంలో దుర్ముహూర్తాలు ఉన్న ఆ సమయంలో లో పాలు పోయకూడదు.. శనివారం చూస్తే ఉదయం 58 నిమిషాల నుంచి ఏడు గంటల 30 నిమిషాల వరకు వర్జ్యం ఉంది. ఈ దుర్ముహూర్తం రాత్రి 7:30 నుంచి 9:00 పది నిమిషాల వరకు ఉంది అంటే వర్జ్యం పోయిన తదుపరి అంటే ఏడున్నర తదుపరి చవితి గడియలు దాటిపోకుండా అంటే సుమారు 10:30 లోపు నాగేంద్రుని ఆరాధించాలి. నాగేంద్ర స్వామికి పాలు పోస్తూ ఈ విధంగా ప్రార్థన చేయాలి. పుట్ట లోని నాగేంద్ర స్వామి లేచి రావయ్య.. బొమ్మ పాలు త్రాగి వెళ్లిపోవయ్య.. చలిమిడి వడపప్పు తెచ్చినామయ్య.. వెయ్యి దండాలయ్య.. నీకు కోటి దండాలయ్య… పుట్టలోని నాగేంద్ర స్వామి.!! పుట్ట దగ్గర ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారు… నన్నెలు నాగన్న.. నాకుల నూనెలు నాకన్నా వారాల నా ఇంటి వారనలు అత్త మిత్రులందరినీ వేలపడగ తొక్కిన పగవాడిని అనుకోకు..
నడుము తొక్కిన నా వాడిన అనుకో.. తోక తొక్కితే తొలగిపో వెళ్ళిపో.. నూకలని పుచ్చుకో పిల్లల్ని ఇవ్వు అని పూట్టలో పాలు పోస్తూ నూక వేసి ప్రార్ధన చేస్తూ ఉంటారు. పాములను ఆరాధించడం మూఢనమ్మకమ పుట్టలో పాలు పోయకూడదు ఏది వాస్తవం.. మానవ శరీరమనే పుట్టకు 9 రంద్రాలు ఉంటాయి. వాటిని నవరంద్రాలు అని పిలుస్తారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని కూడా పిలుస్తారు. పాము ఆకారంలో ఉంటుంది. కావున దానిని వెన్నుపాము అని పిలుస్తారు. ఇది మానవ శరీరంలోని నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద విశాలన్నీ కక్కుతూ మానవ శరీరంలోని సత్వగుణాన్ని నశింపజేస్తుంది. దానికోసమే నాగుల చవితి నాడు ప్రత్యక్షంగా విషర్పాలన్న పుట్టలను పూజ చేస్తూ పాలు పోస్తే మనిషిలోని ఉన్న విష సర్పం శ్వేతత్వం పొందుతుందని, మనిషిలోని విసత్వం తొలగిపోతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు..