Nagula Chavithi : నాగుల చవితి రోజున పాటించవలసిన నియమాలు..!
ప్రధానాంశాలు:
Nagula Chavithi : నాగుల చవితి రోజున పాటించవలసిన నియమాలు..!
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 5వ తేదీన వచ్చింది. ఇక ఈరోజు స్వామివారు భక్తుల నుంచి విశేషమైన పూజలను అందుకుంటారు. అయితే ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలి..? అలాగే స్తోత్రాలను పారాయణం చేయాలి..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో అన్ని శుభదినాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసాలలో నాగుల చవితి పండుగ కూడా ఉంది. అదేవిధంగా మరొక పంచమి నాగుల చవితి వెళ్లిన మరుసటి రోజు ఈ పంచమి వస్తుంది. అయితే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే వారు ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు.
అదేవిధంగా సుబ్రమణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలను కూడా నిర్వహిస్తారు. పురాణాలలో నాగులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక కార్తీక మాసంలో శుక్ల పక్ష చవితి తిధి రోజున నాగుల చవితి పండుగ వచ్చింది. అలాగే నాగదేవతలను ఈ రోజున పూజించడం ద్వారా సర్ప భయాలను తొలగించుకోవచ్చు. అదేవిధంగా సంతాన శుద్ధి మరియు కుటుంబంలో సుఖసంతోషాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగుల చవితి పండుగకు సంబంధించిన పురాణ కథలు చాలానే ఉన్నాయి. వాటిలో నాగదేవతను పూజించడం ద్వారా సర్పదోషం తొలగిపోతుందని భక్తులు గాఢంగా నమ్ముతారు.
– శుక్లపక్షం చవితి తిథి రోజున నాగదేవత పూజించడం వలన సర్ప దోష నివారణ కలుగుతుంది.
– నాగుల చవితి రోజున సంతానం లేని వారు సర్ప దేవతలను పూజించాలి. దీని ద్వారా సంతానయోగం కలగడంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
– రైతులు తమ పంటలను రక్షించుకొనడానికి నాగ దేవతలను పూజిస్తారు. పంటలు సమృద్ధిగా పండి వ్యవసాయ భూమి సారవంతం కావాలని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. తద్వారా పంటలు అధిక దిగుబడికి పశుపక్షాధులకు నాగదేవత రక్షణ కల్పిస్తుందని భక్తులు నమ్ముతారు.
– నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా సర్పదోషంతో పాటు ఇతర అనేక వ్యాధులు సంబంధించిన దోషాలు కలుగుతాయి.
Nagula Chavithi నాగుల చవితి రోజు భక్తులు ఏం చేయాలి…
అనేక ప్రాంతాలలో పుట్టలుంటాయి. అదేవిధంగా దేవాలయాలలో నాగ ప్రతిమలు కూడా ఉంటాయి. నాగుల చవితి రోజున పుట్టలలో పాలు పోయాలి. ఇక దేవాలయాలలో ప్రతిమలు ముందు ఆవు పాలను పెట్టాలి. అలాగే తులసి దళాలను మరియు పువ్వులను వారికి సమర్పించుకోవాలి. ఇక ఆరోజు పంచామృతాన్ని నైవేద్యంగా స్వీకరించాలి. ఇక స్వామివారికి ఇష్టమైన బెల్లం చిమ్మిలి ఉండలు,పెసరపప్పు చలివిడిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజున సుబ్రమణ్యఅష్టకాన్ని 8సార్లు పట్టించాలి. అంతేకాకుండా సుబ్రమణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన భక్తులు మంచి ఫలితాలను పొందుతారు.
Nagula Chavithi ఇంతకీ నాగుల చవితి ఎప్పుడు…
ఈ సంవత్సరం నాగుల చవితి నవంబర్ 4వ తేదీన లేదా 5వ తేదీన అనే గందరగోళం అందరిలోనూ నెలకొంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నాగుల చవితిని నవంబర్ 4వ తేదీన నిర్వహించాలని ఉంది. కానీ మరికొందరు నవంబర్ 5వ తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు. ఇక నాగుల చవితి శాస్త్రం ప్రకారం కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు నవంబర్ 5వ తేదీ రాత్రి 8:56 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిధి ఉంటుంది. కాబట్టి నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు.