Nagula Chavithi : నాగుల చవితి రోజు ఈ మూడు పనులు చేస్తే రాజయోగం వరిస్తుంది…!
ప్రధానాంశాలు:
Nagula Chavithi : నాగుల చవితి రోజు ఈ మూడు పనులు చేస్తే రాజయోగం వరిస్తుంది...!
Nagula Chavithi : హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి నాగుల చవితి. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా జరుపుకునే పండుగ నాగుల చవితి. పుట్టలకి పూజలు చేసి నాగదేవత కి పాలు పోసి ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు పూజలు చేస్తే సర్వరోగాలు మాయం అయిపోతాయని, సకల పాప హరణం జరుగుతుందని భక్తులు విశేషంగా నమ్ముతారు నాగుల చవితి రోజున నాగదేవతను ప్రత్యేకంగా ఆరాధించి పాలు పోసి తాము, తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నాగుల చవితి రోజున స్త్రీలు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు.
పుట్టల దగ్గర శుభ్రం చేసి నీళ్లు చల్లి, పసుపు కుంకుమలు చల్లి, పూలతో అలంకరించి పుట్టలో పాలు పోసి నాగదేవతను నమస్కరించుకుంటారు. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించేవారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, రోగాల బారి నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. నాగుల చవితి రోజు శివనామంతో అర్చిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతిలో విశిష్ట మైనదని అందులో భాగంగానే నాగుల చవితి పూజిస్తూ వస్తున్నామని చెబుతారు.
ఇక నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పూజ గదిలో కలశాన్ని ఏర్పాటు చేసి, దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని నాగేంద్ర స్వామి ఫోటోని గాని ప్రతిమని కానీ పడగని గాని పెట్టి పూజ చేయాలి. పూజకి ఎర్రని పువ్వులు ఉపయోగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. పూజ ముగించిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోయాలి. పుట్ట వద్ద దీపం వెలిగించి పూజ చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితి రోజున నాగదేవతకి పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు.