పార్ట్‌ -3 : మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ చెట్టు నాటాలో మీకు తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పార్ట్‌ -3 : మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ చెట్టు నాటాలో మీకు తెలుసా ?

 Authored By keshava | The Telugu News | Updated on :25 April 2021,9:40 pm

మొద‌టి భాగంలో స్వాతి నక్షత్రం వరకు ఆయా నక్షత్రాల వారు పెంచాల్సిన చెట్టు వాటి ఉపయోగాలు తెలుసుకున్నాం. మిగిలిన నక్షత్రాల గురించి…

విశాఖ– ఈ నక్షత్రం వారు వెలగ, మొగలి చెట్లను పెంచాలి. ఆరాధించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ– ఈ అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచాలి. ఆరాధించాలి. ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రము– ఈ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి. ఆరాధించాలి.. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

nakshatra plants names in telugu part 3

nakshatra-plants-names-in-telugu-part-3

మూల– ఈ మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి. ఆరాధించాలి.. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

పూర్వాషాడ– ఈ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి. ఆరాధించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఉత్తరాషాడ– ఈ ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస చెట్టుని పెంచాలి. ఆరాధించాలి.. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం– ఈ నక్షత్రం వారు జిల్లేడు చెట్టును పెంచాలి. ఆరాధించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రము– ఈ ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచాలి. ఆరాధించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం- ఈ శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. ఆరాధించాలి.. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర – ఈ నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచాలి. ఆరాధించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రము -ఈ నక్షత్రం వారు వేప చెట్టుని పెంచాలి. ఆరాధించాలి.. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటారు.

రేవతి – ఈ నక్షత్రం వారు జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతానానికి సంబంధించిన అనురాగం, ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందుతాయి. జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి===> పార్ట్‌ -1 : మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ చెట్టు నాటాలో మీకు తెలుసా ?

ఇది కూడా చ‌ద‌వండి===> పార్ట్‌ -2 : మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ చెట్టు నాటాలో మీకు తెలుసా ?

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది