పార్ట్ -1 : మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ చెట్టు నాటాలో మీకు తెలుసా ?
ప్రకృతి అంతా జీవరాశుల సముదాయం. దీనిలో ప్రతి ఒక్కదానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే వీటిలో సంబంధాల గురించి మనుకు కొంతవరకే తెలుసు. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు అనేక రకాల పనులు చేస్తాం, వాటికి ప్రకృతిలోని ఇతరాలకు ముడిపడి ఉన్న సంబంధంతో వాటి జయాజయాలు ఆధారపడి ఉంటాయి. అయితే మనం జన్మించిన లేదా నామపూర్వక నక్షత్రం ఆధారంగా మనకు ప్రకృతిలోని మొక్కలతో సంబంధం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం…
జన్మనక్షత్రం అంటే మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ పరిష్కారం చాలా సులభం.
నక్షత్ర చెట్టు నాటితే కలిగే ఫలితాలు
మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ మీకు శుభాలు కలుగుతాయి. నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించండి. వారికి కూడా శుభం జరుగుతుంది.
అశ్వని : – ఈ నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి. వీలు కాకుంటే కనీసం వాటిని పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.
భరణి –ఈ నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి. పూజించాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది.
కృత్తిక – కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి. దీనిద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రము – రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర – ఈ నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
మిగిలిన నక్షత్రాల వారి గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం.