Money : ఈ పొరపాట్లు చేశారంటే మీ డబ్బంతా నీళ్లపాలే.. అవేంటో తెలుసా?
Money : సాధారణంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాలను బాగు చేస్తాయి లేదా నాశనం చేస్తాయి. అంతే కాదండోయ్ ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలు కూడా అవుతాయి. ఈ విషయాలు మన అందరికీ తెలిసినప్పటికీ… ఏమవుతుందిలే అనుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అయితే వాటి వల్ల మన ఆర్థికంగా చాలా చితికిపోతాం. వీటి గురించి వాస్తు శాస్త్రంలో చక్కగా వివరించారు. అయితే వాస్తుకు సంబంధించిన చిన్న తప్పుల వల్ల ఆర్థిక సమస్యలతో పాటు, అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. అంతే కాకుండా రుణ బాధలు విపరీతంగా ఇబ్బంది పెడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా తప్పించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మంది చెత్తకు వినియోగించే డస్ట్ బిన్ ను ఇంటి బయట లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లోకి రాదు. ఒకవేళ అప్పటికే వచ్చినా ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. ఈ ఒక్క పొరపాటు వల్ల ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు. అందుకే ఇంటి ప్రవేశ ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మంచం మీద కూర్చుని తినడం మించిది కాదు. వాస్తు శాస్త్రంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు. మంచంపై అస్సలే కూర్చుని తినకూడదని… ఇలా చేయడం వల్ల ఇళ్లు ఆనందానికి దూరం అవుతుందట. అలాగే రాత్రిపూట వంట గదిలో ఖాళీ పాత్రలను ఉంచడం కూడా చాలా అశుభం. కనీసం కొంచెం అయినా ఆహారం ఉంచాలి.
ఏమీ లేకుండా అంటే ఆహార పదార్థాలు లేకుండా ఇంటి ఖాళీగా ఉంచకూడదు.అలాగే రోజూ పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి. లేకుంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. సనాతన ధర్మంలో దానానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం పూట పెరుగు, పాలు, ఉప్ప వంటి వాటిని అస్సలే దానం చేయకూడదట. ఇలా చేస్తే కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే రాత్రి పూట వంట గదిలో లేక బాత్రూంలో నీటి పాత్రలను ఖాళీగా ఉంచడం కూడా చాలా అశుభం అంట. బాత్ రూమ్ లోని బకెట్ లో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రబావం తగ్గడమే కాకుండా పేదవాడిగా మారే అవకాశం ఉండదు.