Money | కలలో డబ్బు కనిపించడం మంచా? చెడా..? .. జ్యోతిష్య, మనస్తత్వ శాస్త్ర వేత్తల విశ్లేషణ
Money | డబ్బు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అవసరం అయినా, పెద్ద కోరిక అయినా డబ్బు లేకుండా జరగదు. అయితే చాలామందికి ఒక సామాన్యమైన సందేహం ఉంటుంది . కలలో డబ్బు కనిపించడం అంటే మంచిదా? చెడా?” అని. దీనికి జ్యోతిష్యశాస్త్రం మరియు మనస్తత్వశాస్త్రం రెండు కోణాల నుంచి వివరణలు ఉన్నాయి.
#image_title
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం:
డబ్బు అనేది వ్యక్తిగత అభివృద్ధి, లక్ష్య సాధనకు సంకేతం అంటారు జ్యోతిష్య నిపుణులు. ఒకరు జీవితంలో కొత్త అవకాశాల కోసం కృషి చేస్తున్నప్పుడు లేదా సానుకూల మార్పులు ఎదుర్కొంటున్నప్పుడు, కలలో డబ్బు కనిపించడం ఆ మార్పులకు సూచనగా భావిస్తారు.
అయితే మరోవైపు, అనుకోని ఆర్థిక నష్టం సంభవించబోతుందనే సంకేతంగా కూడా కొందరు పండితులు విశ్లేషిస్తారు. అంటే, మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా కూడా ఆ కలను భావించవచ్చు.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు గ్రహాలలో బృహస్పతి, చంద్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి బృహస్పతి దశ బాగుంటే, కలలో డబ్బు కనిపించడం మీకు త్వరలో విజయం, సంపద, సుఖసమృద్ధి వచ్చే సూచనగా భావించవచ్చు.
మనస్తత్వశాస్త్రవేత్తల అభిప్రాయం:
కలలో డబ్బు కనిపించడం కేవలం భౌతిక సంపదతోనే కాదు, ఒక వ్యక్తి గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వీయ విలువను కూడా సూచిస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ఒకవేళ కలలో మీరు డబ్బు కోల్పోతున్నట్లు కనిపిస్తే, అది మీలో అభద్రత భావం, ఆర్థిక చింతలు లేదా స్థిరత్వం లోపించడాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు.