Ratha Sapthami : తిరుమలలో రథసప్తమి వేడుకలు !
Ratha Sapthami : ఫిబ్రవరి 19న రథసప్తమి వేడుకలను తిరుమలలో విశేషంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొవిడ్-19తో కరోనా నిబంధనలను పాటిస్తూ.. తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీటీ సిద్దమవుతుంది. రథసప్తమిరోజు తిరుమలలో శ్రీవారు సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మాడ వీధుల్లో వాహన సేవలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే గ్యాలరీలోకి అనుమతినివ్వనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా చక్రస్నాన కార్యక్రమాన్ని ఏకాంతగానే నిర్వహించనున్నామని తెలిపారు. రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉదయం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగనుండగా.. ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ ఉంటుంది.

Ratha Sapthami in Tirumala From february 19
ఇక, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ , సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉరేగింపు.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.