Dog : బయటకు వెళ్లేటప్పుడు కుక్క ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసా….?
ప్రధానాంశాలు:
Dog : బయటకు వెళ్లేటప్పుడు కుక్క ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసా....?
Dog : కుక్కలను శునకాలనీ, గ్రామ సింహాలని, పప్పీలను పిలుస్తుంటారు చాలా మంది. అయితే దాదాపు చాలా మంది కుక్కను పెంచుకుంటూ ఉంటారు. శునకం విశ్వాశానికి మారు పేరు. కుక్కను కాల యముడి వాహనంగా కూడా చెప్తారు. కొన్ని సంధర్భాల్లో కుక్కను శుభ సూచకంగా, కొన్ని సార్లు అశుభ సూచకంగా చెప్తుంటారు. అలాగే కుక్కకి ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలు ముందుగా తెలుస్తాయి. కుక్కకి భూకంపం వస్తే అందరి కంటే ముందుగా పసిగట్ట గల్గుతుందట. ఈ శక్తి మానవులకి తక్కువ. కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలా భయంకరమైన శబ్దం వస్తుంది. అలా కుక్క ఎవరి ఇంటి ముందు అయితే ఏడుస్తుంది ఆ ఇంట్లో ప్రమాదం రాబోతుంది అని అర్థం…….
రాణి కుక్క అరుస్తుంటే అదే ఊరుకుంటుంది అని వదిలేసి అశ్రద్ధ చేస్తాం. కాని కుక్క కాల యముడి వాహనం. ఎవరైనా గాలి సోకి బాధపడుతున్న తాంత్రిక శక్తులతో ఇబ్బంది పడుతున్న కుక్కని ఆదరించడం వల్ల పోతాయి.కుక్కను కొట్టకూడదు చేతనైతే వాటిని ఆదరించడం, వాటికి సేవ చేయడం, ఆహారం పెట్టడం వంటివి చేయాలి. కుక్కని కొట్టడం వల్ల మనకి చెడు జరుగుతుంది. ఏ కారణం చేతనైనా కుక్కను కొట్టి బాధ పెట్టకూడదు. చేతనైతే వాటికి సాయం చేయాలి. కొన్ని దోషాలను పోగొట్టుకోవడానికి కుక్కకు పూజ చేస్తారు. కుక్కలను చేరదీయడం, అన్నం పెట్టడం, సేవ చేయడం వంటివి చేయడం వల్ల సంతాన ప్రాప్తి కల్గుతుంది. పిల్లలు సరిగా చదవకపోయినా, ఉద్యోగ పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కుక్కకి సేవ చేయడం వల్ల తొలగిపోతాయి.
అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుక్క ఒళ్ల విరుచుకుంటూ ఎదురు వస్తే వెళ్లిన పనికి ఏదో ఆటంకం వస్తుందని అర్థం. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు వెళ్లే వ్యక్తిని చూపి కుక్క అరిస్తే… ఆ పనికి ఏదో అవరోధం రాబోతుందని అర్థం. కుక్క ఎదురుగా భోజనం చేయకూడదు. ఆ ఆహారం నిర్ధానం అవుతుందని అంటారు. కుక్క ఏదైనా వాహనం మీద మాత్ర విసర్జన చేస్తే ఆ వాహన యజమానికి లాభం చేకూరుతుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కుక్క కాలు నాకితే ఆ ప్రయాణంలో ఏదో ఆటంకం ఏర్పడుతుందని అర్థం. ఏదైనా పంట పొలాల్లోకి కుక్క దువ్వితే ఆ పొలంలో లాభం వస్తుందని అర్థం.