Dog Behavior : కుక్కలు చెప్పులు కోరుటకు కారణం తెలుసా… దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా…?
ప్రధానాంశాలు:
Dog Behavior : కుక్కలు చెప్పులు కోరుటకు కారణం తెలుసా... దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా...?
Dog Behavior : ప్రతి ఒక్కరి ఇంట్లో పెంపుడు జంతువులని పెంచుకుంటారు. ఎంతో ప్రేమని కురిపిస్తారు. అవి కూడా మనపై ఎంతో విశ్వాసంతో నడుచుకుంటాయి. అయితే, కొన్ని పెంపుడు కుక్కలు వింతగా ప్రవర్తిస్తుంటాయి. మన వస్తువులను కొరికేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా యజమాని చెప్పులను పట్టుకొని వాటిని కొరికి కొరికి పాడు చేసే వరకు వదలవు. మరోసారి దీనంగా వెళ్లి ఓ మూలన కూర్చుంటాయి. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తుంటాయి. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటాయి. కలు ఇలా ప్రవర్తించడానికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఉందంట.. పెంపుడు కుక్కలు అలా ఎందుకు చేస్తాయో తెలుసుకుందాం…

Dog Behavior : కుక్కలు చెప్పులు కోరుటకు కారణం తెలుసా… దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా…?
ఇప్పుడు కుక్కలు మనిషి చెప్పులు ఎందుకు కొరుకుతాయి.. ఇంకా బట్టలు చించడం వంటి చర్యలు కూడా చేస్తూ ఉంటాయి. చేయుటకు కారణం మన పట్ల ఉన్న ప్రేమకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు. ఆకలి, కడుపులో పురుగులు ఉండటం. ఆటపాటల కోసం కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాయి. ఈ విషయంల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం… మనిషితో అతి దగ్గరగా స్నేహం చేసే జంతువు అంటూ ఉంటే అది ఒక కుక్క మాత్రమే అని చెప్పవచ్చు. మనిషి కంటే కూడా ఎంతో విశ్వాసం కలిగిన జంతువు. మనుషులతో ఎంతో స్నేహభావంతోను, విశ్వాసంతో నువ్వేహరించే గుణం కలిగిన కుక్కలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతాయి. అయితే, అవి చేసే కొన్ని చర్యలు వెనుక ఉన్న కారణాలకు అర్థం చేసుకోవడం ద్వారా వాటి ప్రవర్తనను మనం బాగా గ్రహించవచ్చు. కుక్కలు మనతో ఎంతో ఆప్యాయంగా ఉంటాయి.కానీ కొన్నిసార్లు వాటి పనులు మనకు అర్థం కాకుండా ఉంటాయి.
Dog Behavior కుక్కలు చెప్పులు ఎందుకు కొరుకుతాయి
నీ కుక్కలు వాటి పనులు మనకు చిరాకును తెప్పిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. రాత్రి వేళలో కార్లు, బైకులు వేగంగా తరుముతాయి. వెంటనే ఇంట్లో ఉన్న చెప్పులను చూసిన కుక్కలు కొరకడం మొదలుపెడతాయి. ఇలాంటి ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉందని నిపుణులు అంటున్నారు. కుక్కలు ఇలా చేయడం వల్ల మనకు ఇబ్బంది కలిగిన వాటి ఉద్దేశం అర్థం చేసుకుంటే ఆ చికాకు కాస్త తగ్గవచ్చు. ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకోవడం ద్వారా కుక్కలతో మన సంబంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.
ఒంటరితనంతో కుంగిపోతాయి : ఇంట్లో ఉన్న చెప్పులను కొరకడం, బట్టలను చించడం,వంటివి మనల్ని ప్రేమించడం వల్ల అలా చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. మన శరీరం నుండి వచ్చే వాసన వాటికి ఇష్టమవుతుంది. ఆ వాసనను దగ్గరగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో, చెప్పులను బట్టలను కొరుకుతాయి. ఇంట్లో లేనప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లితే కుక్కలు ఒంటరితనం వల్ల బాధపడతాయి. బాధను తగ్గించుకోవడానికి మన వస్తువులతో సమయం గడపటానికి చూస్తాయి. ఇది వాటి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా కనిపిస్తుంది.
ఆకలి వేసినప్పుడు : కుక్కలు కొన్నిసార్లు కడుపు మంట, త్రీవ్రమైన ఆకలి వల్ల కూడా కుక్కలు చెప్పులను కొరుకుతాయి. ఎప్పుడో పురుగులు ఉంటే కూడా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. ముఖ్యంగా కుక్క పిల్లలు ఈ చర్యలను ఆటగా చేయవచ్చు. అవి పెరిగే కొద్దీ, పరిసరాలను అన్వేషించే కొద్ది, ఇలాంటి అలవాట్లు తగ్గుతాయి. కుక్కల ఆరోగ్యం, ఆహారం, శిక్షణ పై శ్రద్ధ పెడితే ఈ సమస్యలను కొంతవరకు నియంత్రించవచ్చు. ఈ విధంగా కుక్కలు చెప్పులను కొరకడం వెనక ప్రేమ, ఆకలి, ఆట వంటి విభిన్న కారణాలు ఉంటాయి. ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా మనం వాటితో మరింత సానిహిత్యం పెంచుకోవచ్చు.