Lakshmi Devi : తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి… లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందట…!
Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో తులసి మొక్కని ఎంతో ప్రీతికరంగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా నాటుతూ ఉంటారు. నిత్యం తులసి మొక్కకి స్నానం చేయగానే నీరుని పోస్తూ ఉంటారు. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ తులసి మొక్కకు నీటిని పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని జ్యోతిష్య శాస్త్రులు తెలియజేస్తున్నారు. దాంతో శ్రేయస్సు ఆనందం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. […]
Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో తులసి మొక్కని ఎంతో ప్రీతికరంగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా నాటుతూ ఉంటారు. నిత్యం తులసి మొక్కకి స్నానం చేయగానే నీరుని పోస్తూ ఉంటారు. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ తులసి మొక్కకు నీటిని పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని జ్యోతిష్య శాస్త్రులు తెలియజేస్తున్నారు. దాంతో శ్రేయస్సు ఆనందం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసాదించడంతో ఆ ఇంట్లో రోజు ఆనందం కలుగుతుంది.
అయితే తులసి ఆరాధనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు అయితే ఉన్నాయి. తులసి చెట్టుని ఇంట్లో మంచి దిశలో ఉంచి నియమ నిబంధనల విధానంతో ఆరాధించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. తులసి ఆరాధనకు సంబంధించిన కొన్ని ప్రధాన విషయాలు ఇప్పుడు చూద్దాం… హిందూ గ్రంధాల ప్రకారం తులసి మొక్కకు తప్పకుండా పూజ చేయాలి. ఈ విధంగా ఆరాధిస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఆశీర్వచనం కూడా కలుగుతుంది. అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని ఆరాధించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.తులసికి ఎక్కువగా నీరు పోయకూడదు. ఆదివారం తులసిని అస్సలు ముట్టవద్దు.
ఆ రోజు లక్ష్మీదేవి తులసి ముట్టుకుంటే కోపం వస్తుందట. ఏకాదశి నాడు తులసికి నీరు పోయకూడదు. తులసి పూజ సమయంలో నీరును పోసినట్లయితే తులసి మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షకం కలుగుతుంది. సుఖశాంతులతో శాంతి సౌభాగ్యం మేలుకొని ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే కాదు శ్రీమహావిష్ణు అనుగ్రహంతో కుటుంబ సభ్యులు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తులసికి నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని పటించండి. మంత్రం: మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య వర్ధిని ఆది వ్యాధి అర నిత్యం తులసి త్యం నమస్తే… అని తులసికి నీరు పోసేటప్పుడు పాటించాలి. ఈ విధంగా పాటిస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.