Categories: DevotionalNews

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం నుండీ భక్తకోటి ఉపాసించుకుని తరించేందుకు శ్రీ అమృతేశ్వర దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజనీ కొర్రపాటి దంపతులు ‘సహస్ర’ పేరిట సుమారు రెండువందల యాభైపేజీల చక్కని పవిత్ర తెలుగు భక్తి గ్రంధాన్ని ఉచితంగా పంచడం పలువురు రాజకీయ సామాజిక భక్త ప్రముఖుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప వ్యాఖ్యానాలతో, ఋషుల స్తోత్ర విద్యలతో ‘సహస్ర’ పేరిట ధార్మిక జీవన ప్రార్ధనా గ్రంధంగా సాయి కొర్రపాటి సమర్పణలో అందిన ఈ గ్రంధం ప్రస్తుతం బళ్లారిలో వందలకొలది గృహాలలో పారాయణాగ్రంధంగా మారినట్లు భక్తకోటి శ్రీ అమృతేశ్వరదేవస్థానంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  అమృతేశ్వరునిపై శ్రీనివాసుని ‘సహస్ర’ అమృతధారల్ని వర్షించిన కొర్రపాటి

శ్రీ అమృతేశ్వరుని స్వరూపంగా స్పటిక మహాలింగంతో గత సంవత్సరం ప్రతిష్ఠితమైన ఈ అద్భుతమైన ఆలయ వైభవ రూప దర్శనానికి విచ్చేసే భక్తులు అభిషేకం అనంతరం గత కొంత కాలంగా ఈ విశేష శక్తుల సహస్ర గ్రంధాన్ని మహా ప్రసాదంగా తీసుకెళ్తున్నట్లు మన కనులముందు కనిపించే సత్యం.ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం వర్షించే అమృత రసధారల్లాంటి అమోఘ గ్రంధాలకు బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాలలో తెలుగు వారు ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు.

దర్శకధీరుడు, RRR ఫేమ్ ఎస్ ఎస్ రాజమౌళి, కేజీఎఫ్ హీరో యశ్, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎమ్ ఎమ్ కీరవాణి, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రముఖులెందరో శ్రీ అమృతేశ్వరస్వామి ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొన్న అంశం ఇప్పటికీ బళ్లారి ప్రజలు చెప్పుకుంటూంటారు.వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి శివ భక్తుడు కావడం వల్ల బళ్లారికి ఈ అద్భుతం లభించిందని బళ్లారి కమ్మసంఘం ప్రముఖులు సైతం వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు.చాలా ఆలయాల్లో దైవ గ్రంధాలు అమ్ముతున్న ఈరోజుల్లో భక్త కోటికి ఇంత మంచి సహస్ర గ్రంధాన్ని శ్రీ అమృతేస్వరుని కటాక్షంగా ఉచితంగా ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.

వేద పండితులు, అర్చకులు మాత్రమే కాకుండా భక్తులు సైతం హాయిగా చదువుకునే అనేక స్తోత్రాలు, అందమైన వ్యాఖ్యానాలు ఈ బుక్ నిండా ఉండటం వల్ల బళ్ళారి తెలుగు భక్తుల్ని ఈ సహస్ర గ్రంధం విశేషంగా ఆకట్టుకోవడం గమనార్హం.గతంలో సాయికొర్రపాటి సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయస్వామి అరుదైన చిత్రాలతో, యంత్ర మంత్ర తంత్రాత్మకంగా అద్భుత రచనా సంకలనంగా పరమ శోభాయమానంగా రూపుదిద్దిన అఖండ భారీగ్రంధం ‘నేనున్నాను’ని రెండేళ్లనాడు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి.. ప్రచురణకర్త సాయి కొర్రపాటిని, గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్ లపై అభినందనలు వర్షించిన విషయం పాఠకులకు ఎరుకే!

ప్రమాణాలు పాటించడంలో రాజీపడని మనస్తత్వంతో అద్భుత గ్రంధాలు రచించి వేల వేల అభిమానుల్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటికి అత్యంత ఆప్తుడని కొర్రపాటి సాయి సన్నిహితులు చెబుతున్నారు. సినీరంగంలో కొర్రపాటి సాయికి రాజమౌళి చాలా ఆంతరంగిక ఆత్మ బంధువని కన్నడ తెలుగు రంగాలకు తెలుసున్న విషయమే. ఈ క్రమంలో కొర్రపాటి పవిత్ర కార్యక్రమాలకు ఆప్తుడు పురాణపండ శ్రీనివాసేనని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

1 hour ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

2 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

3 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

4 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

5 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

6 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

7 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

8 hours ago