Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా...నిపుణులు ఏమంటున్నారు తెలుసా...?
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి త్వరగా శక్తి రావడానికి అని ఈ డ్రింక్స్ ని ఇస్తున్నారు. ఈ డ్రింక్స్ పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఎక్కువగా అలవాటుగా మారింది. కానీ పిల్లల ఆరోగ్యం పై ముఖ్యంగా వారి కిడ్నీలపై ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తుందో నిపుణులు తెలియజేస్తున్నారు..
Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?
ఎనర్జీ డ్రింక్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో డాక్టర్లు ఏం తెలియజేశారు తెలుసుకుందాం.. ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు, చిన్న పిల్లల కిడ్నీ పనితీరును పాడు చేయగలదు. వీటిలో ఎక్కువగా ఉండే కెఫిన్,ఇంకా చక్కెర ఇతర రసాయనాలు, శరీరంలో ముఖ్యమైన భాగంపై ఒత్తిడిని పెంచుతాయి. చిన్నప్పటి నుంచే ఈ ప్రభావాలు కనిపించకపోయినా, భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్న తర్వాత, ఎక్కువగా, మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. దీనివల్ల శరీరం నీరసం గురవుతుంది. పిల్లలు సరిపడ నీరు తాగకపోతే శరీరం బలహీన పడుతుంది. దీనివల్ల కిడ్నీలు బలహీనపడతాయి. శరీరంలో తేమ తగ్గి,పనిచేసే శక్తిని కోల్పోతుంది. డ్రింక్స్ లో చెక్కర, సోడియం,ఫాస్ఫరస్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లే సమయంలో, రాళ్ళలాగా గడ్డకట్టి అవకాశం కూడా ఉంటుంది కిడ్నీలో రాళ్లు వస్తే చాలా నొప్పి వస్తుంది. చిన్నప్పుడే ఈ సమస్య వస్తే పిల్లలకు శరీరం చాలా ఇబ్బందులను పడాల్సి వస్తుంది.
ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కావున, బరువు పెరుగుతారు. షుగర్ వంటి సమస్యలు కూడా రావచ్చు.కిడ్నీ పనితీరు నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. దీనికి బదులు పిల్లలకు తేనె కలిపి తక్కువ తీపి ఉన్న ట్రిప్షన్ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే ఉత్సాహాన్ని ఇచ్చే పదార్థాలు పిల్లల శరీరంలో రక్త పోటును వేగవంతం చేస్తాయి. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, కిడ్నీలపై ప్రభావం మరింత పెరిగి ఒత్తిడి పడి, సరిగ్గా పని చేయలేకపోవచ్చు. ఇది అందరూ పిల్లలు కాదు, కానీ బలహీనంగా ఉన్న పిల్లల్లో త్వరగా చెడు ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా బాగా శారీరక శ్రమలు చేసినప్పుడు ఎనర్జీ డ్రింక్స్ ను వెంటనే ఇవ్వడం చేత కిడ్నీలపై ప్రమాదం పెరుగుతుంది. ఇది చిన్న కిడ్నీలని ఇంజూరి (Acute Kidney Injure ) అనే పరిస్థితికి దారి తీయవచ్చు.
ఈ మూడు రోజుల నుంచి వారంలోపే కిడ్నీలు పూర్తిగా పాడే అవకాశం కూడా పెరుగుతుంది. చిన్నపిల్లల శరీరం ఇంకా పెరుగుతూ ఉంటుంది.అలాంటి సమయంలో రసాయనాలు ఎక్కువగా ఉన్నటువంటి శరీర భాగాలు ఒత్తిడికి లోనవుతాయి. పెద్దల్లో పోలిస్తే పిల్లలు తక్కువ శక్తిని కలిగి ఉంటారు. పిల్లల ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వకూడదు, అనే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి చేసే డ్రింక్స్ అంటే సహజమైన పండ్ల రసం,కొబ్బరినీళ్లు,లేదా పాలు లాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఉన్నాయి. ఇవి పిల్లల శరీరానికి తగినంత నీటితో ఉంచుతాయి.అలాగే,పెరుగుదలకు కూడా దోహదపడతాయి. రసాయనాలతో నిండిన అనారోగ్యాన్ని కలిగించే డ్రింక్స్ దూరంగా ఉంచండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.