Samudrika Shastra : పురుషులకి ఈ భాగాలలో పుట్టు ముచ్చలు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్టమంటే..!
ప్రధానాంశాలు:
Samudrika Shastra : పురుషులకి ఈ భాగాలలో పుట్టు ముచ్చలు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్టమంటే..!
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి శరీర నిర్మాణం, గుర్తులు, ఆకారాల ఆధారంగా అతని స్వభావం, అదృష్టం, భవిష్యత్తు తదితర విషయాలను విశ్లేషిస్తుంది. ముఖ్యంగా శరీరంపై ఉండే పుట్టుమచ్చలు వారి జీవితంపై గాఢమైన ప్రభావం చూపుతాయని ఈ శాస్త్రం చెబుతోంది. ఇక్కడ సాముద్రిక శాస్త్రం ప్రకారం ఐదు శుభప్రదమైన స్థానాల్లో ఉన్న పుట్టుమచ్చల అర్థాలు తెలుసుకుందాం.

Samudrika Shastra : పురుషులకి ఈ భాగాలలో పుట్టు ముచ్చలు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్టమంటే..!
Samudrika Shastra : అర్ధాలు ఏంటంటే..
అరచేతిలో, ముఖ్యంగా కుడి చేయి బొటనవేలు కింద లేదా మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండటం చాలా శుభం. అలాంటి వారు ధనం, విజయాన్ని సంపాదించేవారుగా మారతారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అరికాళ్ళపై పుట్టుమచ్చలు ఉంటే, వారు జీవితంలో అనేక ప్రయాణాలు చేస్తారని సూచిస్తుంది. విదేశీ ప్రయాణాలు, రాజభోగాలు అనుభవించే అవకాశం కలుగుతుంది. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయి.
నుదిటిపై, ముఖ్యంగా మధ్యలో పుట్టుమచ్చ ఉంటే, వారు గొప్ప నాయకత్వ గుణాలు కలిగినవారుగా గుర్తించబడతారు. మెడ ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆహారం, దుస్తులు, ధనం కొరత లేకుండా జీవిస్తారు. వీరు సౌమ్య స్వభావం, మధుర వాక్చాతుర్యంతో ఇతరుల మనసులు గెలుచుకుంటారు.నాభి దగ్గర పుట్టుమచ్చ ఉండటం సంతాన లాభం, కుటుంబ ఆనందం, ఆర్థిక శ్రేయస్సుకు సంకేతం. ఇలాంటి వ్యక్తుల జీవితంలో స్థిరత్వం, సమతుల్యత ఉంటాయి. ఎంతటి కష్టాలు వచ్చినా మానసిక ధైర్యంతో ఎదిరించి విజయం సాధిస్తారు. పుట్టుమచ్చలు ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఒక నమ్మకం ఆధారంగా చెప్పబడిన విషయాలు మాత్రమే.