Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 December 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు...!

Maharaja Yoga : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తున్న సమయంలోనే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో కుంభ రాశిలో శని శుక్రుడు కలుసుకుంటున్నారు.

Maharaja Yoga కుంభరాశిలో శుక్ర శని సంయోగం..

డిసెంబర్ 28వ తేదీన రాత్రి 11:48 నిమిషాలకు శనీశ్వరుడు శుక్రుడు తో సంయోగం జరగబోతుంది. ఇక ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా జనవరి 28వ తేదీన ఉదయం 7:12 నిమిషాల వరకు అనగా దాదాపు నెలరోజులు పాటు దీని ప్రభావం కొనసాగుతుంది. దీని కారణంగా 2025 మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటి వివరంగా తెలుసుకుందాం…

Maharaja Yoga 2025లో ఏర్పడనున్న మహారాజయోగం ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు

Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు…!

Maharaja Yoga : వృషభ రాశి

శని శుక్ర గ్రహాల సంయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభిస్తాయి. ఇక వ్యాపారుల విషయానికొస్తే వ్యాపారంలో పురోగతిని పొందుతారు. అలాగే ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు.

Maharaja Yoga తులారాశి.

తులారాశి జాతకులకు శని శుక్ర సంయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే పూర్వికుల ఆస్తులు లాభదాయకంగా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి : శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత మార్పులు ఉంటాయి. ఈ సమయంలో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు. ఇక కుంభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే పెళ్లి కాని కుంభరాశి జాతకులకు ఈ సమయంలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది