Laxmi Devi : లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా… తప్పక పాటించండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laxmi Devi : లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా… తప్పక పాటించండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Laxmi Devi : లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా... తప్పక పాటించండి...!

Laxmi Devi : పేదవాడు లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలి అంటే ఏం చేయాలి..? ఏ సమయంలో నిద్ర లేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు..? లక్ష్మీదేవి ఏ విధంగా ఆహ్వానించాలి..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.  నేటి కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడు కూడా ధనవంతులుగా మారుతున్నారు. అలాగే కొందరు ఎన్ని పూజలు వ్రతాలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా చేయవలసిన పని. కుటుంబంలో ఏ స్త్రీ అయినా ఉషోదయ కాలమందు నిద్ర లేచిన వెంటనే తన మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని కళ్ళకు హద్దుకోవాలి.

తర్వాత తన రెండు చేతులను చూసుకొని ఓం శ్రీ లక్ష్మి నమః అనుకోవాలి. ఇంటిని ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. శుభ్రం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ఆ తర్వాత కాల కృత్యాలను తీర్చుకుని తలస్నానాలు చేసి తల నుండి నీరు కారకుండా ఒక ముడి పెట్టుకోవాలి. ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు వేయాలి. తర్వాత తులసి కోట దగ్గరకు వెళ్లి ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోవాలి. పాలను కాచి కాఫీ లేదా టీ పెట్టుకుని భర్తకు ఇవ్వాలి. తర్వాత వారి బిడ్డలకు ఇవ్వడం అనేది జరగాలి. అలాగే ఏరువాక వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఆ ఇంటి పెద్దకు ఇవ్వడం ద్వారా శుభం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు గుమ్మం ముందు కూర్చుని తల దువ్వడం మంచిది కాదు. కొంతమంది సాయంత్ర కాల సమయంలో గుమ్మం ఇటుగా ఉండి బయటకు నీటిని పుక్కలించి వేయడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది.

Laxmi Devi లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా తప్పక పాటించండి

Laxmi Devi : లక్ష్మీదేవి కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా… తప్పక పాటించండి…!

అలాగే గుమ్మంముందు పచ్చని తోరణాలు కట్టాలి. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోని గుమ్మనికి పెట్టండి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఇంట్లోకి వస్తుంది. సంధ్యా సమయం నాడు దీపం అగరవత్తులు వెలిగించి సాంబ్రాణి వేసి తలుపులు తీసి ఉంచాలి. అప్పుడు లక్ష్మీదేవి . ఈ విధంగా చేయడం ద్వారా అష్టైశ్వర్యాల అనుగ్రహంతో లక్ష్మీదేవి దీవెన అందరికీ దొరుకుతుంది. అలాగే అశుభ్రమైన పనులు చేయకుండా ఇతరులకు హాని కలగకుండా శ్రద్ధతో ఆచరిస్తే అన్నింట సుఖమైన సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారని అష్టాదశ పురాణాలలో చెప్పబడింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది