Shani Trayodashi : నేడే శనిత్రయోదశి.. మూడు రాశుల వారు ఇలా పూజ చేస్తే బాధలన్నీ పరార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shani Trayodashi : నేడే శనిత్రయోదశి.. మూడు రాశుల వారు ఇలా పూజ చేస్తే బాధలన్నీ పరార్..!

Shani Trayodashi : హిందూ పురాణాల ప్రకారం ప్రతి మనిషి జాతకంలో శనిగ్రహం అనేది కీలక పాత్ర వహిస్తుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ శనిగ్రహం అనేది జాతకంలో శుభ స్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి పేదవాడు అయినప్పటికీ ఉన్నపలంగా ధనవంతులవుతారు. అదే శనిగ్రహం అశుభ స్థానంలో ఉంటే మాత్రం అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శని గ్రహ సంచారం కారణంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,5:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Trayodashi : నేడే శనిత్రయోదశి.. మూడు రాశుల వారు ఇలా పూజ చేస్తే బాధలన్నీ పరార్..!

Shani Trayodashi : హిందూ పురాణాల ప్రకారం ప్రతి మనిషి జాతకంలో శనిగ్రహం అనేది కీలక పాత్ర వహిస్తుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ శనిగ్రహం అనేది జాతకంలో శుభ స్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి పేదవాడు అయినప్పటికీ ఉన్నపలంగా ధనవంతులవుతారు. అదే శనిగ్రహం అశుభ స్థానంలో ఉంటే మాత్రం అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శని గ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది ఆగస్టు నెల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆగస్టు 18 వ తేదీన శని సంచారం చేయబోతోంది. శని గ్రహం రాత్రి 10:03 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీనే శని త్రయోదశి రాబోతుంది.అయితే ఈ నక్షత్ర సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నక్షత్రంలో శని గ్రహం దాదాపు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉండనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే ఈ ఆగస్టు 18 వ తేదీన జరిగే శని గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులు వారిపై శని ప్రభావం తగ్గనున్నట్లు తెలుస్తోంది. శని సంచార ప్రభావం కుంభరాశిలో ఉండడం వలన కుంభ మరియు మకర ,మీనరాశుల వారిపై శని ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాక ఈ సమయంలో ఈ 3 రాశుల వారికి కాస్త ఉపశమనం లభించవచ్చు. అలాగే ఈ 3 రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆగస్టు 17వ తేదీన శని త్రయోదశి రోజున కొన్ని నియమాలు పాటించడం వలన ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాక శని త్రయోదశి రోజు ఈ విధంగా చేయడం వలన ఈ మూడు రాశుల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.మరి ఈ మూడు రాశుల వారు శని త్రయోదశి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Shani Trayodashi నేడే శనిత్రయోదశి మూడు రాశుల వారు ఇలా పూజ చేస్తే బాధలన్నీ పరార్

Shani Trayodashi : నేడే శనిత్రయోదశి.. మూడు రాశుల వారు ఇలా పూజ చేస్తే బాధలన్నీ పరార్..!

-శని దేవుని ప్రసనం చేసుకోవడానికి ఆగస్టు 17వ తేదీన వచ్చేటువంటి శని త్రయోదశి రోజున కుంభ, మకర ,మీన రాశి వారు తప్పకుండా శని ఆలయాన్ని దర్శించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి.

–ఇక ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా శని దేవుడి విగ్రహం ముందు ఆవునెయ్యి తో దీపం వెలిగించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

–అలాగే ఉసిరి చెట్టు ముందు దీపం వెలిగించి శని సూత్రాన్ని పఠించడం వలన సర్వ పాపాలు తొలగి సుఖ సంతోషాలతో గడుపుతారు.

–ఇక ఈ శని త్రయోదశి రోజు పేదవారికి నల్లటి వస్త్రాలను దానం చేయడం శని దేవుని అనుగ్రహం పొందేలా చేస్తుంది.

-శని గ్రహానికి సంబంధించిన చెడు ప్రభావం నుండి విముక్తి పొందాలి అనుకునేవారు శని త్రయోదశి రోజు కచ్చితంగా హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది