ఇంట్లోపూజకు ఇలాంటి దేవుళ్ల విగ్రహాలు అసలు పెట్టరాదు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఇంట్లోపూజకు ఇలాంటి దేవుళ్ల విగ్రహాలు అసలు పెట్టరాదు ?

 Authored By keshava | The Telugu News | Updated on :6 June 2021,7:00 am

హిందువులు ఇంట్లో నిత్యం దీపారాధన, వారివారి సంప్రదాయాన్ని అనుసరించి ఆయా దేవుళ్లను ఆరాధిస్తారు. ఎక్కువ మంది విగ్రహారాధన చేస్తారు. దీనికోసం ఆయా దేవుళ్ల విగ్రహాలను పూజాగదిలో ఉంచి పూజిస్తారు. అయితే సంప్రదాయం ప్రకారం కొన్ని రకాల దేవుళ్ల విగ్రహాలను పూజించరాదు వాటిని గురించి పెద్దలు చెప్పిన విశేషాలను తెలుసుకుందాం… సాధారణంగా రకరకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు పూజిస్తుంటారు. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు ? వేటిని పూజించకూడదు ? సువర్ణం (బంగారం), రజితం(వెండి), ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టుకుని పూజలు చేయవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి.

రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి. అయితే విగ్రహాలు అంగుష్ట మాత్రం మించి ఉండకూడదు. అదేవిధంగా పగిలినవి, కింద పడి కొంత దెబ్బతిన్నవి అసలు ఉపయోగించ కూడదు. కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ..అందంగా వున్నాయికదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. ఉగ్ర స్వరూపం లేదా తీవ్ర రూపంలో వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజా సమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. శాంతరూపంలో ఉన్నవిగ్రహాలను పూజించాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> సూర్యుడిని ఏ నెలలో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా ?

Should not idols of such gods be originally placed for worship at home


Should not idols of such gods be originally placed for worship at home

అదేవిధంగా వారివారి కుటుంబాల వంశపారంపర్యంగా వస్తున్న ఆయా దేవతామూర్తులను పూజించుకోవడం ఉత్తమం. గురువులు, పెద్దల సూచనల మేరకు దేవతారాధన చేయడం మంచిది అదేవిధంగా శాంతరూపం, చిన్ముద్ర, శాంతికామక రూపాలలోని విగ్రహాలను పూజించడం వల్ల శాంతి, శుభం, సంపదలు లభిస్తాయి. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌, పాలరాయి విగ్రహాలను పూజకు ఉపయోగించకపోవడం మంచిది. వాటిని ఆయా నవరాత్రులు, పూజల సందర్భంలో మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి చిన్న పొరపాటు జరిగినా అవి పగలడం, భిన్ణం కావడం జరుగుతుంది. కాబట్టి లోహసంబంధ విగ్రహాలను వాడటం ఉత్తమం.

ఇది కూడా చ‌ద‌వండి ==> సూర్యుడిని ఏ నెలలో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా ?

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది