Pooja Room : దేవుడి గదిలో పెద్ద విగ్రహాలు ఎందుకు పెట్టుకోకూడదు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Room : దేవుడి గదిలో పెద్ద విగ్రహాలు ఎందుకు పెట్టుకోకూడదు?

 Authored By pavan | The Telugu News | Updated on :14 February 2022,6:00 am

Pooja Room : దాదాపు ప్రతీ హిందువు ప్రతీ రోజూ లేదా వారంలో ఓ రెండు రోజులైనా పూజ చేసుకోవడం మనం చూస్తుంటాం. అలా కుదరకపోతే కనీసం దండం అయినా పెట్టుకుని వెళ్తుంటారు. అయితే పూజ కోసం ఇంట్లో దేవుడి విగ్రహాలు లేదా ఫొటోలు పెట్టుకుంటుంటారు. అయితే పూజా మందిరం సైజుని బట్టి కొందరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటుంటారు. కానీ ఇలా పెట్టుకోవకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజ గది ఎంత పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా చిన్న చిన్న విగ్రహాలే వాడాలని సూచిస్తున్నారు. ఇలా చిన్నవి మాత్రమే పెట్టుకోవాలని చెప్పేందుకు కూడా ఓ కారణం ఉందట. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన ఇంట్లో రోజూ పూజ చేసుకునేందుకు వాడే దేవుడి ఫొటోలు, ముఖ్యంగా విగ్రహాలు బొటన వేలికి మించి ఉండకూడదట.

దేవుడి గదిలోకి విగ్రహాలు కొనాలి అనుకునే వారు ఆలోచించకుండా చిన్న సైజు విగ్రహాలను మాత్రమే కొనాలి. అయితే విగ్రహం ఎంత పెద్దగా ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూప దీప నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది. కానీ అది ప్రతిరోజూ మనం చేయలేం. అందుకే ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. పూజలో మట్టి విగ్రహం గానీ, పంచ లోహాలతో కానీ చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి. అంటే వెండి, బంగారు, ఇత్తడి వంటి విగ్రహాలను కూడా వాడొచ్చు.అయితే పెద్ద విగ్రహాలను పెట్టి తక్కువ మొత్తం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తే… స్వామి వారి కటాక్షం మనకు ఉండదు. ఆయన కడుపును ఖాళీగా ఉంచిన వారిమి అయ్యి పుణ్యానికి బదులుగా.. పాపాన్ని మూట గట్టుకున్న వారిమి అవుతామని చెబుతున్నారు.

why not put big idols in puja mandir

why not put big idols in puja mandir

అందుకే వీలయినంత చిన్న విగ్రహాలనే దేవుడి గదిలో ఉంచుకోవాలి. మనం చేసే పూజకు ఫలితం దక్కాలంటే జాగ్రత్తగా ఉండాలి.దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దేవుడి విగ్రహంపై కాస్త నీళ్లు చల్లి… ఆ తర్వాత బొట్టు.. పూలు పెట్టి అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపం, అగరవత్తులు వెలిగించాలి. ఆ తర్వాత నైవేద్యంగా పండో, ఫలమో కచ్చితంగా పెట్టాలి. ఇంట్లో ఎలాంటి పండ్లు లేకపోతే… కనీసం చక్కెర, తేనె, బెల్లం పప్పుతో కలిపి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా మొక్కుకోవాలి. వీలయితే దేవుడికి సంబంధించిన పాటలో, శ్లోకాలో, మంత్రాలో చదివితే మరీ మంచిది. అంత సమయం లేదనుకుంటే దేవుడి ముందు నిల్చొని మొక్కే కాసేపు అయినా మనసు మొత్తం ఈ స్వామి వారి మీదే లగ్నం చేసి దండం పెట్టుకున్నా సరిపోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది