సూర్యుడిని ఏ నెలలో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా ?
సూర్యుడు… మనకు కనిపించే ప్రతక్ష్య దైవం సూర్య భగవానుడు. ఆయన ఒక్కోనెలలో ఒక్కో రకమైన శక్తిని ఇస్తాడని మన పూర్వీకులు వెల్లడించారు. రుతువులలో ఒక్కో రకమైన శక్తి తీవ్రతతో సమస్త ప్రపంచాన్ని కాపాడుతున్నాడు సూర్యుడు. ఆయనకు మన హిందూ సంప్రదాయంలో ఇచ్చిన ప్రాధాన్యం మరెవ్వరు ఇవ్వలేదు. “ఆదిత్యానామహం విష్ణుః” – ఆదిత్యులలో నేను విష్ణువును – అని భగవద్గీతలో (10-21) చెప్పబడింది.
హిందూ పురాణాలలో “అదితి”, కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు: మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఆయనకు ఒక్కొక్క నెలలో ఒక్కో పేరు ఆ వివరాలు తెలుసుకుందా…
చైత్రం – భగుడు, వైశాఖం – ధాత, జ్యేష్ఠం – ఇంద్ర, ఆషాఢము – సవిత, శ్రావణం – వివశ్వాన్, భాద్రపదం – అర్యమ, ఆశ్వయుజం – అర్చి, కార్తీకం – త్వష్ట, మార్గశిరం – మిత్ర, పుష్యం – విష్ణు, మాఘం – వరుణ, ఫాల్గుణం – పూష. ఇలా ఆయా మాసాలలో సూర్యుడిని ఆయా నామాలతో పిలుస్తారు. వీటి అర్థాలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు – ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు. సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు.
గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథయోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుకనైపునుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు. ప్రతి నిత్యం ఈ ద్వాదశ నామాలతో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యనమస్కారాలు చేస్తే అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు సకల శుభాలు లభిస్తాయని శాస్త్ర ప్రవచనం. ప్రతి రోజు కింద చెప్పిన శ్లోకాలతో సూర్యారాధన చేయాలి..
‘‘ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః ’’
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)