హిందువులు ఇంట్లో నిత్యం దీపారాధన, వారివారి సంప్రదాయాన్ని అనుసరించి ఆయా దేవుళ్లను ఆరాధిస్తారు. ఎక్కువ మంది విగ్రహారాధన చేస్తారు. దీనికోసం ఆయా దేవుళ్ల విగ్రహాలను పూజాగదిలో ఉంచి పూజిస్తారు. అయితే సంప్రదాయం ప్రకారం కొన్ని రకాల దేవుళ్ల విగ్రహాలను పూజించరాదు వాటిని గురించి పెద్దలు చెప్పిన విశేషాలను తెలుసుకుందాం… సాధారణంగా రకరకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు పూజిస్తుంటారు. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు ? వేటిని పూజించకూడదు ? సువర్ణం (బంగారం), రజితం(వెండి), ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టుకుని పూజలు చేయవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి.
రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి. అయితే విగ్రహాలు అంగుష్ట మాత్రం మించి ఉండకూడదు. అదేవిధంగా పగిలినవి, కింద పడి కొంత దెబ్బతిన్నవి అసలు ఉపయోగించ కూడదు. కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ..అందంగా వున్నాయికదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. ఉగ్ర స్వరూపం లేదా తీవ్ర రూపంలో వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజా సమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. శాంతరూపంలో ఉన్నవిగ్రహాలను పూజించాలి.
అదేవిధంగా వారివారి కుటుంబాల వంశపారంపర్యంగా వస్తున్న ఆయా దేవతామూర్తులను పూజించుకోవడం ఉత్తమం. గురువులు, పెద్దల సూచనల మేరకు దేవతారాధన చేయడం మంచిది అదేవిధంగా శాంతరూపం, చిన్ముద్ర, శాంతికామక రూపాలలోని విగ్రహాలను పూజించడం వల్ల శాంతి, శుభం, సంపదలు లభిస్తాయి. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాలరాయి విగ్రహాలను పూజకు ఉపయోగించకపోవడం మంచిది. వాటిని ఆయా నవరాత్రులు, పూజల సందర్భంలో మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి చిన్న పొరపాటు జరిగినా అవి పగలడం, భిన్ణం కావడం జరుగుతుంది. కాబట్టి లోహసంబంధ విగ్రహాలను వాడటం ఉత్తమం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.