Tulasi Vivaham : తులసి వివాహం ప్రాముఖ్యత… పూజా విధానం… ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే…!
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ కార్తీకమాసంలో ద్వాదశి రోజున తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు.ఈరోజు నుండి శుభకార్యాలన్ని మొదలవుతాయి. తులసమ్మ మరియు శాలిగ్రాముల వివాహాన్ని హిందువులు తమ ఇళ్లల్లో మరియు దేవాలయాలలో నిర్వహిస్తారు.వేద పంచాంగ ప్రకారం తులసి వివాహం ఈ ఏడాది కార్తీక మాసంలో ద్వాదశి తిధి నవంబర్ 12 తేదీన మంగళవారం సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభం అవుతుంది.అదేవిధంగా నవంబర్ […]
ప్రధానాంశాలు:
Tulasi Vivaham : తులసి వివాహం ప్రాముఖ్యత... పూజా విధానం... ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే...!
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ కార్తీకమాసంలో ద్వాదశి రోజున తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు.ఈరోజు నుండి శుభకార్యాలన్ని మొదలవుతాయి. తులసమ్మ మరియు శాలిగ్రాముల వివాహాన్ని హిందువులు తమ ఇళ్లల్లో మరియు దేవాలయాలలో నిర్వహిస్తారు.వేద పంచాంగ ప్రకారం తులసి వివాహం ఈ ఏడాది కార్తీక మాసంలో ద్వాదశి తిధి నవంబర్ 12 తేదీన మంగళవారం సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభం అవుతుంది.అదేవిధంగా నవంబర్ 13 వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది.ఇక నవంబర్ 12వ తేదీన సాయంత్రం పూజను పరిగణలోకి తీసుకుంటే తులసి వివాహం నిర్వహించవచ్చు.కానీ ఉదయ తిధి లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే నవంబర్ 13వ తేదీన తులసి వివాహాన్ని జరుపుకుంటారు.
Tulasi Vivaham : తులసి వివాహ పూజా విధి
తులసి వివాహం కోసం ముందుగా ఒక పీఠం మీద ఆసనాన్ని పరచాలి.ఆ పీఠం మీద తులసి మొక్కను శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్టించండి.ఆ తరువాత పీఠం చుట్టూ చెరుకు కర్రలతో మండపాన్ని ఏర్పాటు చేయాలి.అనంతరం ఆ మండపాన్ని పువ్వులతో అలంకరించి కలశాన్ని ప్రతిష్టించాలి.అయితే ముందుగా గౌరీ గణేషుడిని కలశాన్ని పూజించుకొని ఆ తరువాత తులసి మొక్కను శాలిగ్రామ స్వామికి దీపం ధూపం దండలు వస్త్రాలు పువ్వులను సమర్పించండి.తులసి సౌభాగ్య సూచన అయిన పసుపు కుంకుమ వంటి వస్తువులతో పాటుగా ఎరుపు రంగు చున్నీని అందించండి.ఇక పూజ అనంతరం తులసి మంగళాష్టకాన్ని పట్టించండి.తరువాత శాలి గ్రామంతో తులసికి ఏడు ప్రదక్షిణలు చేయించిన తర్వాత విష్ణువుకి తులసికి హారతిని ఇవ్వండి.పూజ ముగిసిన తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టండి.
Tulasi Vivaham తులసి వివాహం రోజున చేయవలసిన నివారణ చర్యలు..
– తులసి వివాహం రోజున తులసి శాలిగ్రామాన్ని పూజించడం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగి ఆనందం నెలకొంటుంది. అలాగే శాంతిని కాపాడుతుందని నమ్మకం.
– తులసి వివాహ సమయంలో తులసి మొక్కకు అలంకరణకి సంబంధించిన వస్తువులను సమర్పించడం వలన అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి.
– తులసి వివాహం రోజున సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల ఇంట్లో దరిద్రం తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారు.
– తులసి వివాహం రోజున తులసి మొక్కతో ఏడుసార్లు ప్రదక్షిణాలు చేయాలి. అలాగే సంధ్యా సమయంలో నెయ్యి దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
Tulasi Vivaham తులసి వివాహ ప్రాముఖ్యత..
తులసి వివాహం నిర్వహించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా వివాహం ఆలస్యమైన వారు తులసి వివాహం జరిపించడం వలన వివాహాలకు కుదురుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందంతో పాటు సిరిసంపదలకి లోటు ఉండదు.