Bhadradri : భద్రాద్రికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్.. ఇవి మీకు తెలుసా?
Bhadradri : భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి వాడే కోటి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు. తలంబ్రాలకు కావాల్సిన బియ్యం కోసం వడ్లను మిల్లుల్లో పట్టించకుండా ఓపికతో ఒక్కో గింజను వలుస్తారు. రాముల వారి కల్యాణానికి వాడే మంగళ సూత్రాన్ని 18వ శాతాబ్దంలో భక్త రామదాసు చేయించారు. దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇక ముత్యాల తలంబ్రాలు బాగా ఫేమస్. వీటిని అప్పట్లో తానీషా సమర్పించారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాటిని అందజేస్తోంది.ఈ ఆలయంలో రాములకు అవసరమయ్యే నగల ఖర్చును రాముడే చెల్లించుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఆరు లక్షల రూపాయల ఖర్చును అప్పటి తానీషాకు చెల్లించారు.
త్రేతాయుగం నాటి శ్రీరామ టెంకీల రూపంలో ఆయనకు రాముల వారు ఇచ్చారు. ఈ నాణేలను ఇప్పటికీ టెంపుల్ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. రాముడి గర్భగుడికి సంబంధించిన గోపురాన్ని ఒకే గ్రనైట్ తో చెక్కారు. దీని బరువు సుమారు 36 టన్నులు ఉంటుంది. ఈ గర్భగుడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని ఎవరూ చేయించలేదు. రామదాసు గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా కొట్టుకొచ్చి అతని చేతులోకి వచ్చింది. దీనిని అక్కడ ప్రతిష్టించారు. రామదాసు పేరు చెబితే భద్రాచలంతో పాటు గోల్కొండ కూడా గుర్తుకు వస్తుంది. ఇక్కడ ఆయనను బంధించిన గది రామదాసు బంధీఖానాగా ఇప్పటికీ కోటలో కనిపిస్తుంది.
Bhadradri : నగల ఖర్చును చెల్లించిన రాముడు
ఇందులో రామదాసు చెక్కిన సీతారాములతో పాటు హనుమంతుని ప్రతిమలు కనిపిస్తాయి. ఇక భద్రాద్రి ఆలయాన్ని దర్శించుకున్న ఆదిశంకరాచార్యులు సాక్షత్తు వైకుంఠాన్ని అక్కడ చూశారట. అందుకే ఈ ఆలయంలో దేవుడికి వైకుంఠ రాముడు అనే పేరు వచ్చింది. భద్రుడి కోరిక మేరకు రాముడు భద్రగిరిపై వెలిశాడు. అందుకే గర్భగుడి పక్కనే భద్రుడి ఆకారం కూడా కొండలా కనిపిస్తుంది. దీనిని చెవిని ఆనించి వింటే శ్రీరామ నామం వినిపిస్తుందని కొందరు చెబుతుంటారు.