Success Mantra : వ్యక్తి జీవితంలో అసత్యం వలన కలిగే నష్టం… నిజానకి ఉండే విలువ ఏంటో మీకు తెలుసా.?
Success Mantra : కొందరి జీవితం పది అబద్ధాలు రెండు నిజాలతో సాగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అబద్ధాలు ఎక్కువగా ఆడే వారే ఉన్నారు. అయితే ఇలా అబద్దం ఆడటం వల్ల వచ్చే నష్టం ఏంటి? నిజం చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సహజంగా జీవితంలో ఒక మనిషి తప్పకుండా ఏదో ఒక సమయంలో అసత్యాలను మాట్లాడుతూ ఉంటారు. కారణం ఎలాంటిదైనా అసత్యం చెప్తాడు. పలుమార్లు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, ఇంకొన్నిసార్లు ఇతరుల నుండి కాపాడుకోవడానికి అసత్యాలను వాడుతూ ఉంటారు.
అయితే అసత్యం జీవితం కాదు. ఏదో ఒక సమయంలో ఆ అసత్యం బయటపడి ఒక సమస్యగా మారుతుంది. ఒక్కొక్క సమయంలో మీరు అసత్యాలు మాట్లాడతారు అనే భావం ఇతరులలో ఏర్పడితే తదుపరి మీరు ఎంత సత్యం చెప్పినా ఇతరులు మిమ్ములని నమ్మరు. జీవితంలో నిజానికి ఉండే విలువ.. అసత్యం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1) జీవితంలో ఎవరితోనైనా అసత్యం బంధం అనేది ప్రారంభమైతే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడడం కష్టం. 2) ఒక మనిషి వారి జీవితంలో నీడ, అద్దం వంటి సన్నిహితులను ఎంచుకోవాలి. ఎందుకనగా నీడ మిమ్మల్ని ఎప్పుడు వదలదు. అలాగే అద్దం ఏనాటికి అసత్యం చెప్పదు. 3) అసత్యం చెప్పి మనిషికి వారు ఆ అసత్యాన్ని కి ఎంత బాధ్యత వహించాలో వారికి తెలియదు. ఎందుకనగా వారు ఒక ఆసత్యాన్ని దాచడానికి మరికొన్ని అసత్యాలు చెప్పవలసి వస్తుంది. 4) సత్యం చెప్పులు ధరించి టైయానికి అసత్యం సగం ప్రపంచాన్ని జయిస్తుందని అసత్యాల గురించి ఒక సామెత కూడా ఉంది. సత్యం కంటే అసత్యం వేగవంతంగా వ్యాపిస్తుంది. 5) జీవితంలో అసత్యంలో నిజాయితీ అనేది ఉండదు. అంటే అసత్యం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.