Sri Rama Navami : నేడు శ్రీరామనవమి… ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్షు..!
ప్రధానాంశాలు:
Sri Rama Navami : నేడు శ్రీరామనవమి... ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్షు..!
Sri Rama Navami : త్రేతా యుగంలో వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం. శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజు జరిగిందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. దేశానికి రాజైన దశరధుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించిన దశరధుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. చైత్రమాసం తొమ్మిదో రోజు అయినా నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు..
Sri Rama Navami : శ్రీరామ అష్టోత్తర పూజ
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు వచ్చే స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎవరైతే కాశీలో జీవిస్తూ అ పుణ్యక్షేత్రంలోని మరణిస్తారో వారు మరణించి కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ తారకమంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సంకతి కలిగిస్తాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న భక్తితో సేవించాడు.ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అని అధ్యయనాన్ని పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున మీరు శ్రీరాముడి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరతాయి.
అలాగే శ్రీరామ నవమి రోజున శ్రీరామదేవుని కథ ప్రాంతాన్ని ఆచరించడం కూడా మంచిది. అయితే ఇంతకీ విశిష్టత కలిగినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు కనుక పసుపు రంగు చీర కట్టుకుంటే సకల శుభాలు మీకు కలుగుతాయి. పసుపు అనేది ఎంత మంగళకరమైనదో మనందరికీ తెలుసు.. మీ భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది. అలాగే అపార ఐశ్వర్య యోగం కూడా మీ సొంతమవుతుంది. అలాగే చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మానసిక ప్రశాంతతను కూడా మీకు కనిపిస్తుంది. పసుపుకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో పసుపు రంగు దుస్తులకి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. కానీ పసుపు అనేది చాలా శుభప్రదమైనది. పసుపు లేకుండా మనం ఏ పూజ కార్యక్రమాలను కానీ లేకపోతే ఎటువంటి శుభకార్యాలను కానీ జరపలేము.. కాబట్టి పసుపుకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు పసుపు రంగు దుస్తులు ధరించండి. మీరు అనుకున్న కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు…