Sri Rama Navami : సీతారాముల కల్యాణోత్సవాలకు హాజరైన పరమేశ్వర్‌రెడ్డి
ప్రధానాంశాలు:
Sri Rama Navami : సీతారాముల కల్యాణోత్సవాలకు హాజరైన పరమేశ్వర్‌రెడ్డి
Sri Rama Navami : శ్రీరామా నవమిని పురస్కరించుకొని ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాలకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఉప్పల్ నియోజకవర్గ లోని పలు ఆలయాలు, కాలనీలలో వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పరమేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Sri Rama Navami : సీతారాముల కల్యాణోత్సవాలకు హాజరైన పరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గం లోని పలు కాలనీలలో దేవాలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాలకు పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి స్వామి వారికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో లింగంపల్లి రామకృష్ణ ,ఆకారపు అరుణ్ ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,ఉపేందర్ రెడ్డి ,సందీప్ భాస్కర్ పాల్గొన్నారు.