Things : ఇతరుల నుంచి ఈ వస్తువులను తీసుకుంటున్నారా… పేదరికానికి ఆహ్వానం పలికినట్లే…!
ప్రధానాంశాలు:
Things : ఇతరుల నుంచి ఈ వస్తువులను తీసుకుంటున్నారా... పేదరికానికి ఆహ్వానం పలికినట్లే...!
Things : సాధారణంగా సమాజంలో ప్రతి ఒకరితో కలిసి మెలిసి జీవించాలి అని అనుకుంటారు. మనిషి ఒక సంఘ జీవి. అలాగే తన జీవితంలో ఎన్నో పరిచయాలతో అనేక విషయాలను తెలుసుకోవాలని అలాగే పంచుకోవాలని అనుకుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే మనం ఒకానొక సమయంలో కొన్ని రకాల వస్తువులను ఇచ్చుపుచ్చుకుంటాం. మరి కొన్ని రకాల వస్తువులను ఇతరుల ఇంటి నుండి తీసుకురాకూడదు అని అంటారు. ఎందుకంటే ఇతరుల ఇంటి నుండి తీసుకువచ్చిన వస్తువులు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని వాస్తు శాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తాను ఉపయోగించే వస్తువులు అతని శక్తి పై ప్రభావం చూపుతాయి. అలా ఇతరు నుండి వస్తువులు తీసుకువచ్చిన లేదా ఇచ్చిన ఆ యజమాని మారడంతో ఆ వస్తువులకు ఉన్న శక్తి కూడా మారుతుంది. కాబట్టి నెగటివ్ ఎనర్జీ ప్రభావం చూపే కొన్ని వస్తువులను ఇతరు నుండి పొరపాటున కూడా ఇంటికి తీసుకొనిరాకూడదు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Things ఫర్నిచర్
కొంతమంది వారి ఆదాయానికి తగ్గట్టుగా పాత ఫర్నిచర్లను కొనుగోలు చేస్తారు. అయితే ఇలా పాత ఫర్నిచర్ని కొనుగోలు చేయడం వలన ఫర్నిచర్ తో పాటు నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా వాసు దోషాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఇంట్లోకి పాత సామాన్లను తీసుకువస్తే పేదరికల్ని ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారవుతారు.
చెప్పులు : సాధారణంగా చుట్టాల ఇంటికి లేదా తెలిసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్లడానికి అక్కడ ఉన్న వారి చెప్పులను ధరిస్తూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదు. ఎందుకంటే శరీరంలోని ప్రతికూల శక్తికి పాదాలు మొదటి స్థానంగా చెబుతారు. ఇలా ఇతరుల చెప్పులను లేదా బూట్లను ధరించినప్పుడు వారి ప్రతికూలన శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీరు చాలా నష్టపోతారు.
గొడుగు : ఇతరుల ఇంటి నుంచి గొడుగుని తీసుకురావడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇలా ఇతరుల ఇంటి నుండి గొడుగు తీసుకువచ్చినప్పుడు గ్రహాల స్థితి క్షీణిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరొకర ఇంటి నుండి గొడుగుని తీసుకురావాల్సి వస్తుంది. ఇలా తీసుకువచ్చినప్పుడు అవసరం తీరిన వెంటనే వారికి ఆ గొడుగును తిరిగి ఇవ్వాలి.