Chanakya Niti : డబ్బు విషయంలో ఇవి పాటించండి.. లేదంటే చాణక్య చెప్పినట్లే అవుతుంది.
Chanakya Niti: చాణిక్యుడు.. కౌటిల్యుడు.. విష్ణు గుప్తుడు.. ఇలా ఎన్నోపేర్లు కలిగిన ఆచార్య చాణక్య నీతి గురించి చాలా మందికి తెలిసిందే. ఈయన తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో పేర్కొన్నారు. ఇందులో జీవితంలోని వివిధ కోణాలను బయటపెట్టారు. ఇవి నేటికీ అందరికీ స్పూర్తిదాయకంగా ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు.ప్రస్తుతం డబ్బు సంపాదనే ధ్యేయంగా మనిషి జీవిస్తున్నాడు. అయితే ఎంత డబ్బులు సంపాదించినా జీవితంలో ప్రశాంతతను పొందలేకపోతున్నాడు. దీనికి కారణం అతనిలోని కొన్ని చెడు అలవాట్లు. వ్యసనాలు.
ప్రశాంతమైన జీవితం కోసం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.డబ్బు సంపాదించేందుకు మనిషి చాలా కష్టపడతాడు. ఇందుకోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్ధపడతాడు. చాణక్య నీతి ప్రకారం డబ్బును సంపాదించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చు, తగినంత డబ్బు సమకూరినపుడు జీవితం సాఫీగా సాగుతుంది. డబ్బు సంపాదించిన వ్యక్తిలో తనపై తనకు నమ్మకం పెరుగుతుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.చాణక్య నీతి ప్రకారం మోసాలు, తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించవద్దు. ఇలా చేస్తే.. ఆ డబ్బులు మీ వద్ద ఎప్పటికీ ఉండవు. మళ్లీ ఏదో ఒక రకంగా వెళ్లిపోతాయి. ఇలాంటి సంపద వల్ల మొత్తం కుటుంబం బాధ పడొచ్చు.
Chanakya Niti: కొన్నింటికి దూరంగా ఉండాలి
అందుకే తప్పుడు మార్గాల్లో, ఊరికనే వచ్చే సొమ్ము నిలబడదని పెద్దలు చెబుతుంటారు. కష్టపడి సంపాదించండి. మీ సంపద ఇతరులకు ఉపయోగపడేలా చూడండి. దీని వల్ల మీ సందప మరింత పెరుగుతుందిని వివరించాడు.దురాశ మనిషి ఆనందాన్ని దూరం చేయడమే కాకుండా అతని ఆలోచనను చాలా సంకుచితంగా మారుస్తుందని చాణక్య చెప్పారు. అత్యాశగల వ్యక్తి మొదట విశ్వాసాన్ని కోల్పోతాడు. అతను ఇతరుల పురోగతిని చూసి అసూయ చెందుతాడు. అప్పుడు అతనిలా లేదా అంతకంటే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో చాలాసార్లు తప్పుడు దారిలో పయనిస్తూ తనకు తానే కష్టాలను కోరి తెచ్చుకుంటాడు. అందుకే దురాశకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెప్తోంది.
కోపంగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అలాంటి వారు చిన్న చిన్న విషయాలకే పరధ్యానంలో పడతారు. అటువంటి పరిస్థితిలో ఏది తప్పు, ఏది ఒప్పు అని కూడా తేల్చుకోలేడు. ఎవరి కోపం వారికే చేటు చేస్తుంది. అందుకే జీవితంలో ప్రశాంతత కావాలంటే కోపానికి దూరంగా ఉండమంటోంది చాణక్య నీతి.మనిషిలో అహం ఉంటే ఎంత సంపాదించినా పెద్దగా పేరు ఉండదు. అది తన గౌరవంపై ప్రభావం చూపుతుంది. అహం చేరుకున్న వ్యక్తికీ గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. అహం తో ఉన్న వ్యక్తి తనకు తానే గొప్ప వ్యక్తిగా ఫీలవుతాడు. ఇతరులను చిన్నచూపు చూస్తాడు. దీంతో అతని పక్కన ఎవరూ ఉండలేరు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఆనందానికి దూరమవుతాడు. అలాంటి వారు పతనమవడానికి ఎక్కువ టైమ్ పట్టదని ఆచార్య నీతిలో చెప్పాడు.