Holi Festival : హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసా ..?
Holi Festival : భారతీయులు అత్యంత ఆనందంతో జరుపుకునే పండుగలలో ఒకటి హోలీ. ఈ పండుగ వచ్చిందంటే బంధువులు , కుటుంబ సభ్యులు అంతా ఒక దగ్గర చేరి రంగులు పూసుకుంటూ, కోలాటాలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పండుగను సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుపుకుంటారు. హోలీ రోజు కృష్ణా రాధలను కొనియాడుతూ వారి పాటలతో సంబరాలు జరుపుకుంటారు. అయితే అసలు హోలీ పండుగ ఎలా వచ్చిందో, ఆరోజు రాధాకృష్ణులను ఎందుకు కొని యాడుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలాకాలం తపస్సు చేసి తనను చంపడం అసాధ్యమయ్యేలా బ్రహ్మ నుంచి వరం తీసుకుంటాడు. దీంతో అతనికి దుర అహంకారం పెరిగి స్వర్గ నరక లోకాన్ని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు.
అంతేకాకుండా ప్రజలు దేవుళ్లను పూజించకుండా తనని మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు మాత్రం తండ్రికి విరుద్ధంగా దేవుడు పూజలు చేస్తూ నిత్యం ఆరాధించేవాడు. ప్రహ్లాదుడు నిత్యం శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. దీంతో హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు విష్ణువును కొలవద్దని ప్రహ్లాదుడిని హెచ్చరించాడు. అయినా ప్రహ్లాదుడు వినక పోవడంతో అతడిని చంపాలని మొదటగా విషం పోస్తారు అది కాస్త అమృతంగా మారుతుంది. ఆ తర్వాత మరో ప్రయత్నంగా ఏనుగులతో తొక్కించే విధంగా ప్రయత్నిస్తాడు. అయినా ఎటువంటి హాని జరగదు. ఇలా ఎన్ని పథకాలు చేసిన ప్రహ్లాదుడకి ఏమి
కాకపోవడంతో హిరణ్యకశిపుడు తన చెల్లి హోళికా ఒడిలో చితిలో కూర్చోవాలని ప్రహ్లాదుడిని ఆజ్ఞాపిస్తాడు. అయితే హోలిక కప్పుకున్న బట్టలు తొలగిపోయి ప్రహ్లాదుడిని రక్షిస్తాయి. చెడు ఆలోచన చేయడం వలన హోలిక ఆ మంటల్లో దహ జీవన అవుతుంది. దీంతో హోలిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కశిపుడు ని సంహరిస్తాడు. ఇక హోలీ పండుగ వెనుక మరొక కథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు తాను నల్లవాడు అని రాధ చిలిపిగా వెక్కిరించడంతో కృష్ణుడు తన తల్లికి చెప్పడంతో ఆమె రాధకు రంగు పూయాలని నిర్ణయించుకోగా కృష్ణుడు రాధ గోపికలు ఆనందంతో రంగులు పూసుకుంటారు. దీంతో అది హోలీ పండుగగా జరుపుకోబడింది.
