Gomata : గోమాత మహిమ గురించి పరమేశ్వరుడు చెప్పిన కథనం

Advertisement
Advertisement

Gomata : హిందువుల భక్తిగా కొలిచే గోమాత Gomata మహిమల గురించి అనేక విశేషాలు మనం విన్నాం.. ఒక్క గోమాతకు పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు మనకు చెప్పే మాటలు. గోమాత గొప్పతనం గురించి పార్వతి దేవి ఒకానొక సందర్భంలో శివుడిని అడగటంతో ఆయన గోమాత యొక్క విశిష్టతను వివరించాడు..

Advertisement

Advertisement

కైలాసమున పార్వతి దేవి భక్తితో పరమశివుడిని ఇలా అడిగింది… నాధా..! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు , అంట్లు కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమగునో తెలిపామని అడగటంతో పరమేశ్వరుడు ప్రసన్న వదనంతో

Gomata : దేవి.. ! గోమాత

దేవి.. ! గోమాత Gomata నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు తొలగును. గోవు కొమ్ముల మెుదట బ్రహ్మ విష్ణువులు, కోమ్ముల చివర గంగాది తీర్ధములు, నుదురు నందు రుద్రుడు,నుదురు పై భాగమున మహాదేవుడు, నాసికాదండమున షణ్ముఖుడు, చెవులలో అశ్వనీదేవతలు, కుడికన్నులో భాస్కరుడు,ఎడమకన్నులో చన్ద్రుడు, జిహ్వలో వరుణుడు, హుంకారమున సరస్వతీదేవి, దవడలలో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు, మెడనందు ఇంద్రుడు, ఉదరమున త్రయోదశ విశ్వేదేవతలు.

shiva parvati

వక్ష స్థలమున గాయత్రి, నాల్గుపాదాలలో నాల్గు వేదములు, డెక్కల మధ్య గంధర్వులు, డెక్కల చివర గరుత్మంతుడు, డెక్కల ఉభయపార్శ్వములలొ అప్సరసలు, ప్రుష్ఠమున లక్ష్మీ నారాయణులు, ఏకాదశరుద్రులు, అవయవ సంధులలో అష్టవసువులు, పిరుదలలో పిత్రు దేవతలు, తోకనందు సోముడు, తోకయందలి రోమములలో సూర్యచన్ద్రులు, మూత్రమున గంగాదేవి, పోదుగు నుండి వచ్చు పాలలో సరస్వతీదేవి, పెరుగులో నర్మదతీర్ధం, నెయ్యినందు అగ్నిహోత్రుడు, పేడయందు లక్ష్మీ దేవి, మూత్రమున గాయత్రీ దేవి, రోమములలో త్రయత్త్రింశత్కోటిదేవతలు, ఉదరమున భూమాత మెుదలగు సమస్త దేవతలుకలరు.

గోమాతకు ఐదుసార్లు ప్రదక్షణం చేసిన భూ ప్రదక్షణంతో సమానం. గోమాతను పూజిస్తే సంస్థ దేవతలను పూజించినట్లు. ఆషాడ శుద్ధ తోలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సన్నిధానం పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున పూజ చేసిన అనంత కోటి పుణ్యముల ఫలం పొందటమే కాకుండా 41 రోజులు చేసిన పూజ ఫలితం ఆ ఒక్క రోజే పొందవచ్చుని బోధించాడు పరమశివుడు

Recent Posts

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

27 seconds ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

60 minutes ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

2 hours ago

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

3 hours ago

Mutton : సంక్రాంతి పండుగ వేళ మీరు మటన్ కొనేటప్పుడు.. ఇవి గమనించలేదో అంతే సంగతి..!

Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

4 hours ago

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

6 hours ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

6 hours ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

7 hours ago