Tollywood : టాలీవుడ్ సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. అన్నీ ఇండస్ట్రీలతో పాటు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌కి పెద్ద దెబ్బ పడుతోంది. గత ఏడాదే వందల కోట్లలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ నష్టాలు ఈ ఏడాది కూడా తప్పడం లేదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కారణం కరోనా సెకండ్ వేవ్. నిర్మాతలకి కరోనా సెకండ్ వేవ్ హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. ఎన్నో ఆశలతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని తారుమారయ్యాయి.
కరోనా దెబ్బ సినిమా ఇండస్ట్రీకి కోలుకోని విధంగా తగులుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయి నిర్మాతలకి బాగానే ఆర్ధిక నష్టం జరిగింది. ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేయాలంటే పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించే సినిమాలను పూర్తి చేయలేక మధ్యలో వదిలేయలేక ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఊహించుకోవచ్చు. సంక్రాంతికి వచ్చిన క్రాక్ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ సంబర పడ్డారు. కానీ సీన్ మళ్ళీ రివర్స్ అయింది. షెడ్యూల్ చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.
అయితే ఇప్పటికే పోస్ట్ పోన్ చేసిన సినిమాలను మళ్ళీ మంచి రిలీజ్ డేట్ కి రీ షెడ్యూల్ చేయడం అంటే అంత సులభంగా అయ్యే పని కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మీడియం బడ్జెట్ సినిమాలు లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం సినిమాలు పోస్ట్ పోన్ చేయగా మే లో రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ నటించిన నారప్ప కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఇవే కాదు రాధే శ్యామ్, కేజీఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సహా దాదాపు అన్నీ సినిమాలు పోస్ట్ పోన్ అవడం ఖాయంటున్నారు. మళ్ళీ ఇండస్ట్రీకి వందల కోట్లలో నష్టం తప్పదంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.