Astrology 2023 : ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. 2023 లో వాళ్లు పట్టిందల్లా బంగారమే
Astrology 2023 : ఇంకో 30 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. అది 2023. కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారు. కొత్త సంవత్సరం నుంచి కొత్తగా పనులు ప్రారంభించాలని అనుకుంటారు. అందులో భాగంగానే.. జాతకాలు, రాశులు, రాశి ఫలాలు, జ్యోతిష్యాలు కూడా కొత్త సంవత్సరంలో మారుతుంటాయి. అయితే.. 2023 లో సంవత్సరం ప్రారంభం కాగానే బృహస్పతి సంచారం ఉంటుంది. అది కూడా 2023 లో మేషరాశిలో ఉంటుంది. బృహస్పతి ప్రభావం అన్ని రాశుల వాళ్లపై ఉంటుంది కానీ..
ఈ మూడు రాశి చక్రాల వాళ్లకు మాత్రం దీని ప్రభావం ప్రత్యేకంగా ఉండనుంది.నిజానికి బృహస్పతి గ్రహాన్ని దేవతల గురువు అంటారు. దానికి కారణం నవగ్రహాలలో బృహస్పతి పెద్దది కావడం. 2023 మొదట్లో మేషరాశిలో బృహస్పతి ఉండబోతోంది. దాని వల్ల.. 3 రాశి చక్రాల వ్యక్తుల జాతకమే మారనుంది. అందులో ఒకటి మీన రాశి. ఈ రాశి వాళ్లకు బృహస్పతి రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని వల్ల.. డబ్బు ఊహించని విధంగా వచ్చి చేరుతుంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. పెట్టుబడి పెడతారు.
Astrology 2023 : మిథున రాశి వారికి కూడా లాభదాయకం
మిథున రాశి వాళ్లకు బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల జాతకంలో 11వ ఇంట్లో సంచరించబోతు న్నాడు. దీని వల్ల లాభం చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్లకు ఫలితాలు బాగుంటాయి. అలాగే.. కర్కాటక రాశి వాళ్లకు బృహస్పతి చక్రం బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో పని చేస్తున్న వాళ్లకు ప్రమోషన్స్ వస్తాయి. ఇంక్రిమెంట్స్ లభిస్థాయి. విద్యార్థులకూ బాగుంటుంది.