Bhagini Hastha Bhojanam : భగిని హస్తభోజనం పండుగ రోజు సోదరి ఇంటికెళ్లి భోజనం చేస్తే మృత్యుగండాలు తొలగిపోతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhagini Hastha Bhojanam : భగిని హస్తభోజనం పండుగ రోజు సోదరి ఇంటికెళ్లి భోజనం చేస్తే మృత్యుగండాలు తొలగిపోతాయి…!!

 Authored By aruna | The Telugu News | Updated on :13 November 2023,8:30 pm

Bhagini Hastha Bhojanam : ఈ కార్తీకమాసంలో వచ్చే పండుగని భగినీ హస్త భోజనం లేదా అన్నా చెల్లెలు పండుగ అంటారు. సోదరీ సోదరీ ప్రేమకి అద్దం పట్టి పండుగ. ఈ ఏడాది అన్నాచెల్లెల పండుగను నేడు జరుపుకోనున్నారు. సోదరీ సోదరీమకి అడ్డంపట్టే పండుగలో రాఖీ పండుగ. తర్వాత చెప్పుకోదగినది ఇది సోదరీ సోదరుల ఆప్యాయత అనుబంధాలకు అద్దం పట్టి ఒక సాంప్రదాయం భగిని హస్త భోజనం అంటే సోదరులు సోదరి పెట్టే భోజనం కనుక భోజనం అంటారు. దీపావళి పండుగ రెండవ రోజు నాడు ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెలు ఇంటికి వెళ్లి వారి చేతితో నుదుట తిలకం దిద్దించుకుని వారి వంట తిని బహుమతిని ఇస్తారు. ఈ అన్నా చెల్లెలు పండుగను భయ్యా ధోజి అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా జరుపుకుంటారు. దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. తమ సోదరీ ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వయంగా తిని ఆమెను ఆశీర్వదిస్తారు.

పురాణ కథ సూర్య భగవానుడికి యమధర్మరాజు యమునా కుమారుడు కుమారుడు అంటే విపరీతమైన అభిమానం. సమవర్తి యమధర్మరాజు సోదరి యమునా వివాహమై అత్తవారింటికి వెళ్ళింది. అలా వెళ్ళిన యమునా తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని కోరింది.. కానీ ఆయనకు తీరిక ఉండదు. యమలోకంలో పాపలను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక తీర్చలేదని బాధపడేవారు. కాలం గడిచిపోతోంది. చివరికి వీలు చేసుకుని సోదరి ఇంటికి అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలి ఇంటికి వెళదామని అనుకున్నాడు. ఆరోజు కార్తీక శుద్ధ విజయం రాకరాక సోదరుడు వచ్చాడని యముని ఎంతో సంతోషపడింది. చెల్లెలి యమునా సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. ఎంతో కాలానికి కార్తిక శుద్ధ విధినాడు. కలవటంతో సోదరీ సోదరులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరిపై ప్రేమతో నాకు ఇష్టమైన పదార్థములతో భోజనం పెట్టావు.. నీకు ఏదైనా వరం ఇస్తాను.

దీంతో యమునా దేవి అన్నయ్య లోక కళ్యాణం కోసం నాకు ఒక వరం ఇవ్వు అని అడిగింది. ఈ కార్తీక శుద్ధ విదేయనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరీ ఇంటికి వెళ్లి అన్న తమ్ముడు భోజనం చేస్తారో. నీవు ఎట్టి పరిస్థితుల్లో వారి జోలికి వెళ్ళవద్దని అటువంటి సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇది నా కోరిక అని యమధర్మరాజుని యమునా అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి లోక కళ్యాణం కోసం అడిగావు కనుక తధాస్తు అని చెల్లెలు దీవించి వెళ్ళాడు. దీంతో ఈరోజు అక్కాచెల్లెళ్లు చేతి వంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపవృత్తి దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది. సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని యముడు వరాలు ఇచ్చాడట.. అలా ఈ వరం సాంప్రదాయంగా మారింది. కనుక ఈ రోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తిని ఆప్యాయంగా బహుమతిని ఇచ్చి వస్తారు. ఈరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమదీపం పేరుతో నాలుగు ముఖాల దీపాన్ని కూడా ఉంచుతారు…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది