Karthika Masam : కార్తీక మాసం.. శివ కేశవులకి ఇష్టమైన ఈ మాసంలో ఇవే చేయకూడనివి…!
Karthika Masam : కార్తీక మాసం మొదలవుతుంది. ఈ మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టమైనది. ఇక ఈ మాసంలో ఆడవారు ఈ నెల అంతా ఉపవాసాలతో, పూజలతో నిమగ్నమైపోతారు. ఈ మాసమంతా నిత్యము ఇంట్లో దీపాలను వెలిగిస్తూ.. ఉపవాసాలు ఉంటూ ఉంటారు. దీపావళి తదుపరి రోజునుండి ఈ కార్తీకమాసం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కార్తీమాసం ప్రారంభ విషయంలో చాలా గజిబిజి జరిగింది. ఈ కార్తీకమాసం పాడ్యమి తేదీతో ప్రారంభం ఈ ఏడాది దీపావళి మరుసటినాడు […]
Karthika Masam : కార్తీక మాసం మొదలవుతుంది. ఈ మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టమైనది. ఇక ఈ మాసంలో ఆడవారు ఈ నెల అంతా ఉపవాసాలతో, పూజలతో నిమగ్నమైపోతారు. ఈ మాసమంతా నిత్యము ఇంట్లో దీపాలను వెలిగిస్తూ.. ఉపవాసాలు ఉంటూ ఉంటారు. దీపావళి తదుపరి రోజునుండి ఈ కార్తీకమాసం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కార్తీమాసం ప్రారంభ విషయంలో చాలా గజిబిజి జరిగింది. ఈ కార్తీకమాసం పాడ్యమి తేదీతో ప్రారంభం ఈ ఏడాది దీపావళి మరుసటినాడు కాకుండా రోజు మొదలవుతుంది. ఎందుకనగా ఈసారి అమావాస్య 24, 25 తేదీలలో రావడంతో నరక చతుర్దశిని దీపావళి పండుగను 24న జరుపుకోవడం జరిగింది. 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం రావడంతో ఆనాడు పండుగను జరుపుకోకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. దాంతో 25వ తేదీన సాయంకాలం తర్వాత పాడ్యమి గడియలు రావడంతో సూర్యోదయ సమయంలో పాడ్య మే ఉండాలి.
కావున సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తేదీలలోనే ఈ కార్తీక మాసం ప్రారంభానికి సూచనగా అంటుంటారు. కావున బుధవారం నుంచి ఈ మాసం మొదలవుతుంది. ఈ మాసానికి ప్రత్యేకత ఎందుకనగా… కార్తీక మాసానికి నెలను మొదలు పెట్టేముందు పాడ్య మే ముహూర్తంలోనే కావున దీపావళి తెల్లవారుజామున ఉదయం అమావాస్య ఘడియలు ఉన్నాయి. కావున రేపు ఉదయం నుంచి కార్తీక మాసాన్ని మొదలు పెడతారు. అన్ని మాసాలలోను కార్తీకమాసానికి తనదైన ప్రత్యేకత ఉంటుందని.. కార్తిక మాసానికి సమానమైన మాసము లేదు కావున శ్రీమహావిష్ణువుకి సమానమైన దేవుడు ఉండడు. అని వేదంతో సమానమైన శాస్త్రం ఉండదని.. గంగతో సమానమైన తీర్థం ఉండదని స్కంద పురాణంలో తెలియజేయబడింది. కావున ఈ మాసానికి అత్యంత ప్రత్యేకమైన ఈ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది.నెలలో చాలా భక్తి భావంతో ఆరాధిస్తూ ఉంటారు.
ఈ నెలలో పూజలు చేయడం వలన అనుకున్న కోరికలు తీరటం తో పాటు పాపాలు కూడా తొలగిపోయి మోక్షం కలుగుతుందని తెలియజేస్తున్నారు. శివుడికి విష్ణు కి అత్యంత ఇష్టమైన నెల ఈ కార్తీక మాసం. ఈ మాసాన్ని శివుడికి విష్ణుకి అత్యంత ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. కావున ఈ మాసంలో శివకేశువులని సమానంగా పూజిస్తుంటారు. కార్తీక మాసం ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది. ఈ మాసంలో శైవ వైష్ణవ భక్తుల అత్యంత నియమ అలతో కేశవులను ఆరాధిస్తారు. ఇక ప్రముఖ శైవ క్షేత్రాలను వైష్ణవ ఆలయాలు శివ కేశవుల నామస్మరణతో వినిపిస్తుంటాయి.
ఈ కార్తీక మాసం నియమాలు పాటించే వారికి.. కార్తిక మాసంలో నియమాలు పాటించే వాళ్లకి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఎక్కువగా శాఖాహార న్ని తీసుకోవాలి. మరిచిపోయి కూడా మాంసాహారాన్ని తీసుకోవద్దు.. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండాలి. ప్రతిరోజు పూజ విదాకాలను నిర్వహించాలి. దానధర్మాలకు పెద్దపీట వేసుకోవాలి. మంచం పై పడుకోకూడదు. కార్తీక మాసం ఈ నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో భగవంతుని పూజించాలి. అలాగే నది స్నానాలు చేసి కార్తీకదీపం నదులలో వదులుతూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి.