Chanakya Niti : ఈ పనులు చేస్తే ఎన్నో అనర్థాలు.. ఇంట్లో ఇవి జరగొద్దంటున్నచాణక్య
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారంటూ ఉండరు. చాణక్యుడిని విష్ణు గుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులోని నియమాలను ఇప్పటికీ ఎంతో మంది పాటిస్తారు. ఈ నీతిశాస్త్రం ప్రజల జీవన విధానాలను చాణక్య అనుభవంతో వివరించాడు.మానవులు స్వార్థపరులని డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకడుగు వేయరని అప్పట్లోనే చెప్పాడు. మానవ సంబంధాలు ఆర్థికంగా ఆధారపడి ఉంటాయని చెప్పాడు. ఎటుంవంటి వారితో స్నేహం చేయాలో చెప్పాడు.
విజయం సాధించాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించాడు. భార్యభర్తలు ఎలా ఉండాలి. తల్లిదండ్రలును ఎలా చూసుకోవాలి ఇలా ఎన్నో విషయాలను మానవులను దృష్టిలో పెట్టుకుని తన నీతి శాస్త్రంలో తెలిపాడు. అయితే చాణక్య ఇంట్లో ఈపనులు చేయోద్దని సూచించాడు. ఇలా చేస్తే ఎన్నో అనర్థాలు కలుగుతాయని నీతి శాస్త్రంలో వివరించాడు అవేంటో ఇప్పుడు చూద్దాం..ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవుళ్లను పూజించుకోవాలని సూచించాడు. నిత్యం దైవారాధన చేస్తే ఎటువంటి నెగిటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయిని చెప్పాడు.
అందుకే ఇంట్లో పూజాలు చేస్తే అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారని అన్నాడు. అలాగే పెద్దల ఆలనా పాలనా చూసుకుంటూ గౌరవించానలని వారికి సేవలు చేసుకోవలని చెప్పాడు. పెద్దలను అగౌరపర్చితే వినాశనాలకు దారితీస్తుందని సూచించాడు.అయితే హిందువులు ఎక్కువగా ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుకుని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. కాగా ఈ తులసి మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోతే ఇంట్లో కీడు జగుతుందిని ముందే సూచనగా ఇలా జరుగుతుందిని చెప్పాడు. అలాగే ఇంట్లో నిత్యం గొడవలు జరిగితే ప్రశాంతత ఉండదని ఎన్నో అనర్థాలకు కారణం అవుతుందిని చెప్పాడు. నిత్యం గొడవలు జరిగితే ఇంట్లో లక్ష్మీ దేవత నిలవదని అన్నాడు.