Vastu Tips : ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే అష్ట దరిద్రాలు మీ వెంటే.. జాగ్రత్త సుమీ!

Authored By pavan J | The Telugu News | Published on: May 5, 2022, 8:20 am

Vastu Tips : వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో ఉంటేనే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే వస్తువులు ఎక్కడ ఉంచాల్సినవి అక్కడే ఉంచితేనే… ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ప్రేమాభిమానాలతో ఉంటారు. అదే సమయంలో వాస్తు దోషం ఉంటే… అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో ఘర్షణలు వస్తాయి. అష్ట దరిద్ర్యాలు వెంటాడుతాయి. అయితే వీటన్నిటిని ఇంటి నుంచి తరిమికొట్టి లక్ష్మీ దేవి ఇంటికి ఆహ్వానించాలంటే కొన్ని ఇలాగే చేయాల్సింది. అందుకే ఇంటి విషయంలో దిక్కులతో పాటు వాస్తు అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఇంట్లో ఉంచుకునే కొన్ని వస్తువులు కూడా కుటుంబ పురోగతికి ఆటంకం కల్గిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలని చెబుతున్నారు. మరి ఇంట్లో నుంచి బయట పడేయాల్సిన వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips these things do not kept in home for good wealth

Vastu Tips these things do not kept in home for good wealth

  • నటరాజ విగ్రహాన్ని ఇంట్లో అస్సలే ఉంచకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.
  • వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పడూ ఉంచకడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రబావం చూపుతాయని చెబుతున్నారు.
  • ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు. వాస్తు సాస్త్రంలో గులాబీలు తప్ప మిగిలిన ముళ్ల మొక్కలను అశుభ కరమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ముళ్ల చెట్లు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
  • మునిగిపోతున్న ఓడల చిత్రాలు, వేట చిత్రాలు, కత్తి యుద్ధాల చిత్రాలు, పట్టుబడిన ఏనుగుల చిత్రాలు, ఇంట్లో ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలు ఉంచడం దోషపూరితమైనవి అని పేర్కొంటారు. ఇందుకు కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.
  • అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కల్గిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని కల్గి ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థికంగా బాగు పడి సుఖ సంతోషాలతో ఉండాలంటే.. కచ్చితంగా నియమ నిబంధనలను పాటించాల్సిందే. వాస్తు ప్రకారం జీవించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

pavan J

No bio available for this author.

  1. "Renu Desai : ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఇలా చేస్తారా?.. రేణూ ఆవేదన..!"

  2. "Renu Desai : పవన్ విడాకుల వార్తల మధ్య రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వారిపై పై తీవ్ర ఆగ్రహం!"

  3. "Suriya Politics : రాజకీయాల్లోకి హీరో సూర్య?.. పొలిటికల్ ఎంట్రీపై కోలీవుడ్ స్టార్ క్లారిటీ!"

  4. "Sonia Gandhi Modi : కనీసం నా కళ్లలోకి కూడా చూడరు.. ప్రధాని మోదీపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!"

  5. "TDP YSRCP : పవన్ వ్యక్తిగత జీవితంపై టీడీపీ, వైసీపీ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు..!"

  6. "Pawan Kalyan Divorce Venu Swamy : పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం.. పాత వీడియో వైరల్..!"

  7. "Pawan Kalyan Anna lezhneva Divorce : పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం.. ప్రకటనలో ఏముందంటే?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp