Diwali Festival : దీపావళి రోజు ఈ వస్తువులను కొనకండి… దరిద్రం పడుతుంది…!
Diwali Festival : చాలామంది దీపావళి రోజు ఇంటి కోసం కొత్త కొత్త వస్తువులను కొంటుంటారు. బంగారం వెండే కాదు, ఇంట్లోని గిన్నెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ రోజున కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి. తెలియక చాలామంది వాటిని కొనేస్తుంటారు. ఇలా కొనడం మంచిది కాదని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. ఈనమ్మకాలు తరతరాలుగా మన జాతుల ఇమిడిపోయాయి. చాలామంది దీపావళికి కొత్త కళాయిలు, గిన్నెలు కొంటుంటారు. కానీ మన నమ్మకాల ప్రకారం కళాయి కొనకూడదు. ఎందుకంటే కళాయి కొన్నప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలు కొనడం వలన ఇల్లు కూడా ఖాళీ అవుతుందని ఇంట్లో సంపద ఉండదని ఒక నమ్మకం. ఒకవేళ తెలియక కొంటే ఆ కొత్త గిన్నెను నీటితో లేదా ఏదైనా ఆహారంతో నింపి ఇంటికి తీసుకువెళ్లాలి.
ఖాళీ గిన్నెను మాత్రం తీసుకువెళ్లకూడదు. వంట గదిలో అప్పట్లో కత్తిపీటలు ఉండేవి. ఇప్పుడు చాకులు వాడుతున్నారు. కత్తి మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే వస్తువులను ముక్కలుగా చేసేందుకు. అంటే దాని ఆకారాన్ని నాశనం చేస్తున్నామన్నమాట. దీపావళి రోజు కొన్ని ఇంటికి తీసుకు వెళ్ళకూడదు ఇది దురదృష్టాన్ని తెస్తాయని పెద్దలు అంటుంటారు. అలాగే దీపావళి పండుగ రోజు నూనెలు, నెయ్యి, వెన్న వంటి వాటిని కొనకూడదు. ఎందుకంటే ఆ ఉత్పత్తులు పవిత్రమైన ఉత్పత్తుల జాబితాలోకి రావు. అందుకే ఆరోజు కొనకూడదంటారు. నూనెలు అవసరం ఉంటే దీపావళి, ధన్ తేరాస్ పండుగలకు ముందు కొని ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే పండగల తర్వాత కొనాలి.
ఆ రెండు రోజులు మాత్రం అస్సలు కొనకూడదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గాజు వస్తువులు రాహు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని దీపావళి పండుగ రోజు కొనకూడదు. గాజు పగిలితే పదునైన వస్తువుగా మారుతుంది. ఇవి సులభంగా కూడా పగిలిపోతాయి. కాబట్టి వీటిని పండుగ రోజు కొనుగోలు చేసే ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. ఇనుముతో చేసే వస్తువులను మనం ఇప్పుడు ఎక్కువగానే వాడుతున్నాం. ఇనుముతో చేసిన వస్తువులు రాగి, ఇత్తడి కంటే చాలా తక్కువ ధరకే వస్తాయి. అందుకే వీటిని కొనేందుకు ఇష్టపడతారు. అయితే దీపావళి పండుగ రోజు ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు. ఇలా చేయడం వలన ఇంటికి దరిద్రం పడుతుంది.