Shani : కుంభరాశిలో శనీశ్వరుని సంచారం … ఈ రాశుల వారికి ధన లాభం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 November 2024, 6:00 am
  •  Shani : కుంభరాశిలో శనీశ్వరుని సంచారం ... ఈ రాశుల వారికి ధన లాభం...!

Shani : నవగ్రహాలలో శని దేవున్ని కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడిగా కొలుస్తారు. అందుకే గ్రహాలలో అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన గ్రహంగా శనీశ్వరుడుని పరిగణించడం జరిగింది. అంతేకాక నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ఇదే. అందుకే శనీశ్వరుడు ఏదైనా ఒక రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లపాటు సంచరిస్తాడు. అయితే ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఛత్ పూజ అనంతరం శనీశ్వరుడు కుంభరాశిలోకి అడుగు పెడతాడు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ప్రత్యక్ష తిరోగమన కదలికలను బట్టి వాటి ప్రాముఖ్యతను పరిగణించడం జరుగుతుంది. అయితే అన్ని గ్రహాలు కూడా ఒక నిర్దిష్ట కాలం పాటు ప్రత్యక్షంగా లేదా తీరోగమణంలో కదులుతూ ఉంటాయి. దీంతో వివిధ రాశుల వారిపై దీని ప్రభావం పడుతుంది.

Shani : రాశిని మార్చనున్న శనీశ్వరుడు…

అయితే ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఇదేవిధంగా ప్రయాణిస్తూ నేరుగా ఛత్ పండుగ తర్వాత అంటే నవంబర్ 15 సాయంత్రం 5:09 నిమిషాలకు కుంభరాశిలోకి అడుగు పెడతాడు. దీంతో దీని ప్రభావం మొత్తం 12రాశుల వారిపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో కొన్ని రాశుల వారికి ఇది శుభప్రదంగా కూడా మారనుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

వృషభ రాశి  : శనీశ్వరుడి గమనంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలను అర్జిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహ అవకాశాలు ఏర్పడతాయి. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారు.

కన్య రాశి : శనీశ్వరుడి కదలికలలో మార్పుల కారణంగా కన్య రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ మద్దతుతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.

Shani : కుంభరాశిలో శనీశ్వరుని సంచారం ... ఈ రాశుల వారికి ధన లాభం...!

Shani : కుంభరాశిలో శనీశ్వరుని సంచారం … ఈ రాశుల వారికి ధన లాభం…!

తులారాశి : కుంభరాశిలో శని సంచారం వలన తులా రాశి జాతకులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వృత్తి మరియు వ్యాపారంగంలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు.

కుంభరాశి : శనిసంచారం కారణంగా కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి