Maha Shivratri : మహా శివరాత్రి నుండి ఈ రాశుల కి అదృష్టం పట్టబోతుంది…!
ప్రధానాంశాలు:
Maha Shivratri : మహా శివరాత్రి నుండి ఈ రాశుల కి అదృష్టం పట్టబోతుంది...!
Maha Shivratri : హిందువులు మహా శివరాత్రిని Maha Shivratri పవిత్రంగా జరుపుకుంటారు. ఇక ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి నాడు మహా శివరాత్రిని వచ్చింది. పురాణాల ప్రకారం ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగి లోకాన్ని రక్షించేందుకు లింగోద్భవం జరుగుతుందని చెబుతారు. ఇక హిందువులు ఆ రోజున శివాలయానికి వెళ్లి శివుడికి Shivudu అభిషేకాలు, అర్చనలను మరియు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

Maha Shivratri : మహా శివరాత్రి నుండి ఈ రాశుల కి అదృష్టం పట్టబోతుంది…!
Maha Shivratri మహా శివరాత్రి నాడు గ్రహాల సంచారం
ఇక మహా శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచరించడం వలన కొన్ని రాశుల వారి జీవితాల పై ఈ ప్రభావం పడుతుంది. దీంతో శివరాత్రి నుండి ఆ రాశులకు శివుడు తన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Maha Shivratri మేష రాశి
మహా శివరాత్రి తర్వాత నుంచి మేష రాశి జాతకులు అనేక ప్రయోజనాలు పొందుతారు. కెరియర్ లో మంచి పురోగతి ఉంటుంది . ఇక వర్తక వ్యాపారాలు చేస్తున్నవారు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మొత్తం మీద మేష రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు.
వృశ్చిక రాశి : మహాశివరాత్రి నుండి వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఎదురయ్యే సమస్యలన్నీ ఓపికగా పరిష్కరించుకుంటారు. వీరి సంపద రెట్టింపు కావడంతో ఆర్థికంగా స్థిరపడతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి శివుడి అనుగ్రహం ఉండడంతో జీవితంలో సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.
మకర రాశి : మహాశివరాత్రి నుండి మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక కెరియర్ లో ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక మకర రాశి వారు శివరాత్రి రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వీరి కోరికలన్నీ నెరవేరే అవకాశముంటుంది.
కుంభరాశి : కుంభరాశి జాతకులకు మహాశివరాత్రి తర్వాత నుండి కలిసి వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున కుంభ రాశి జాతకులు శివుడికి ఉపవాసం ఉండి ప్రత్యేకంగా పూజలను చేయడం ద్వారా మంచి ఫలితాలను చూస్తారు.