Idols : ఇత్తడి విగ్రహాలు మళ్లీ కొత్త వాటిలా మెరవాలంటే… ఈ టిప్స్ పాటించండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Idols : ఇత్తడి విగ్రహాలు మళ్లీ కొత్త వాటిలా మెరవాలంటే… ఈ టిప్స్ పాటించండి…?

Idols : ప్రస్తుతం పండగల టైం రానే వచ్చేసింది. ఈ టైంలో భగవంతుడిని మరియు అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాము. ఈ తరుణంలో ఇత్తడి విగ్రహాలను ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాము. అయితే ఆ విగ్రహాలకు అభిషేకాలు మరియు అర్చనలు కూడా చేస్తూ ఉంటాము. దీనితో ఆ విగ్రహాల వస్తువులకు కాస్త రంగు తగ్గి నల్లగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ విగ్రహాల వస్తువులను మళ్ళీ కొత్తవాటిలా మెరిసేలా చేయాలి అంటే ఇప్పుడు మేము […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Idols : ఇత్తడి విగ్రహాలు మళ్లీ కొత్త వాటిలా మెరవాలంటే... ఈ టిప్స్ పాటించండి...?

Idols : ప్రస్తుతం పండగల టైం రానే వచ్చేసింది. ఈ టైంలో భగవంతుడిని మరియు అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాము. ఈ తరుణంలో ఇత్తడి విగ్రహాలను ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాము. అయితే ఆ విగ్రహాలకు అభిషేకాలు మరియు అర్చనలు కూడా చేస్తూ ఉంటాము. దీనితో ఆ విగ్రహాల వస్తువులకు కాస్త రంగు తగ్గి నల్లగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ విగ్రహాల వస్తువులను మళ్ళీ కొత్తవాటిలా మెరిసేలా చేయాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. ఈ చిట్కాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అంతేకాక సులువుగా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే వీటిని క్లీన్ చేసేందుకు అధిక టైం కూడా పట్టదు. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే మనం ముందుగా విగ్రహాలను డిష్ వాషర్ సబ్బు లేక లిక్విడ్ తో శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా గోధుమపిండి మరియు అరటి స్పూను ఉప్పు మరియు వైట్ వెనిగర్ ను కలుపుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని విగ్రహాల వస్తువులపై రుద్ధి క్లీన్ చేయాలి. ఇలా చేయడం వలన అవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ చిట్కా కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే నిమ్మ రసం లో కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకొని ఈ పేస్టును స్క్రబ్ తో విగ్రహాలకు అప్లై చేసి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల విగ్రహాలు కొత్త వాటిలా మెరిసిపోతాయి. అలాగే మంచి సువాసన కూడా వస్తాయి.

Idols ఇత్తడి విగ్రహాలు మళ్లీ కొత్త వాటిలా మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి

Idols : ఇత్తడి విగ్రహాలు మళ్లీ కొత్త వాటిలా మెరవాలంటే… ఈ టిప్స్ పాటించండి…?

అలాగే ఇత్తడి మరీ రాగి వస్తువులను కూడా క్లీన్ చేయటంలో చింతపండు ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది అయితే ఈ చింతపండు గుజ్జు తీసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు మరియు బేకింగ్ సోడా కలుపుకోవాలి ఈ మిశ్రమం మరియు వస్తువులను శుభ్రం చేస్తే అవి తెల్లగా మెరిసిపోతాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది