Prakaasham..జనసేన ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
గణేశ్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అందరూ విగ్రహాలు ప్రతిష్టించుకున్నారు. కాగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. చాలా మంది మట్టి విగ్రహాలను ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని బేస్తపాలెంలో శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో నాయకులు మట్టి విగ్రహాలను పలువురికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జనసేన జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ కోసం మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల ఎన్విరాన్‌మెంట్ పొల్యూట్ అవుతున్నదని పేర్కొన్నారు. పర్యావరణ పరిక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పాటు పడుతున్నట్లు చెప్పారు. జనసేన ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీకి జనసైనికులు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీను, జహీర్, నాగార్జున, రాజేష్, వలి మోసిన్ పాల్గొన్నారు.