Zodiac Signs : కీలక రాశులలో మారుతున్న లక్షణాలు… ఈ రాశిలో వారికి పట్టనున్న రాజయోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : కీలక రాశులలో మారుతున్న లక్షణాలు… ఈ రాశిలో వారికి పట్టనున్న రాజయోగం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుని స్వస్థానమైన కుంభరాశిలో వక్రయించడం వలన అలాగే కర్కాటక రాశిలో బుధుడు వక్రయించడం వలన , అదేవిధంగా కన్యా రాశిలో శుక్రుడు నీచ భంగం చెందడం వలన కొన్ని రాశుల వారి యొక్క జాతకాలు బలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాశుల వారికి ఆదాయ ప్రయత్నాల్లో విజయాల వరిస్తాయి. అంతేకాక హోదాలు పెరగడం , ప్రముఖులతో పరిచయాలు , అనుకూలతలు బాగా పెరుగుతున్నాయి. మరో రెండు నెలల పాటు ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : కీలక రాశులలో మారుతున్న లక్షణాలు... ఈ రాశిలో వారికి పట్టనున్న రాజయోగం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుని స్వస్థానమైన కుంభరాశిలో వక్రయించడం వలన అలాగే కర్కాటక రాశిలో బుధుడు వక్రయించడం వలన , అదేవిధంగా కన్యా రాశిలో శుక్రుడు నీచ భంగం చెందడం వలన కొన్ని రాశుల వారి యొక్క జాతకాలు బలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాశుల వారికి ఆదాయ ప్రయత్నాల్లో విజయాల వరిస్తాయి. అంతేకాక హోదాలు పెరగడం , ప్రముఖులతో పరిచయాలు , అనుకూలతలు బాగా పెరుగుతున్నాయి. మరో రెండు నెలల పాటు ఈ రాశుల వారి జీవితాలలో శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరి ఏ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Zodiac Signs : వృషభరాశి…

రాశ్యధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో నీచభంగం పొందడం వలన ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాక చతుర్ద స్థానంలో బుధుడు , దశమ స్థానంలో శనీశ్వరుడు బలంగా ఉండడం వలన ఈ రాశుల వారి ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే గృహ మరియు వాహన యోగాలకు అవకాశం లభిస్తుంది.మంచి సత్ఫలితాలను పొందుతారు.

మిధునరాశి…

భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శని మరియు తృతీయ స్థానంలో బుధుడు ఉండటం వలన ఈ రాశి వారికి ఊహించని రాజయోగాలు పట్టనున్నాయి. ఉద్యోగంతో సహా అనేక రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి మరియు వ్యాపార రంగాలలో అంచనాలకు మించి ధన లాభం వస్తుంది. కొద్ది ప్రయత్నాలతోనే ఆదాయం అభివృద్ధి చెందుతుంది.

Zodiac Signs తులారాశి..

ఈ రాశి వారి జీవితంలో ప్రస్తుతం శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించబోతున్నాడు. బుధ మరియు రాహులు లాభ స్థానంలో చేరుతున్నారు. దీంతో ఈ తులా రాశి వారికి రాజ్యపూజలు సుఖసంతోషాలు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

Zodiac Signs కీలక రాశులలో మారుతున్న లక్షణాలు ఈ రాశిలో వారికి పట్టనున్న రాజయోగం

Zodiac Signs : కీలక రాశులలో మారుతున్న లక్షణాలు… ఈ రాశిలో వారికి పట్టనున్న రాజయోగం…!

మకర రాశి…

శని మరియు బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా సంచరించడంతో ఈ రాశి వారికి ధనం మరియు భాగ్యస్థానాలు పటిష్టంగా మారనున్నాయి. దీంతో వీరి ఆదాయం పెరగడమే కాక కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి. ఆదాయం దనాభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరియు నష్టాల నుండి బయటపడి లాభసాటిగా ముందడుగు వేస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది