Mars And Ketu Conjunction : శక్తివంతమైన యోగం, 18 ఏళ్ల తర్వాత ఈ రాశుల దశ తిరిగింది
ప్రధానాంశాలు:
Mars And Ketu Conjunction : శక్తివంతమైన యోగం, 18 ఏళ్ల తర్వాత ఈ రాశుల దశ తిరిగింది
Mars And Ketu Conjunction : వచ్చే నెల ఏడో తేదీన నవ గ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఆ రాశిలో అప్పటికే కేతువు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు సింహ రాశిలో కలుసుకోవడం వల్ల మూడు రాశులకు బాగా కలిసి వస్తోంది. కుజుడు పరిమాణంలో చాలా పెద్ద. కేతువు నీడ గ్రహం. ఇటువంటి లక్షణాలున్న గ్రహాల కలయిక వల్ల 18 సంవత్సరాల తర్వాత శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఏయే రాశులకు బాగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
కుజ, కేతు యోగం 18 సంవత్సరాల తర్వాత అదృష్టాన్ని మోసుకొస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు. అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు.
మిథున రాశి
వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్థులు వారి కార్యాలయాల్లో పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. వచ్చే నెల ఏడో తేదీ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారికి సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది.
వృషభ రాశి
వచ్చే నెల ఏడో తేదీ తర్వాత ఈ రాశివారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులున్నీ తొలగిపోతాయి. మంచి స్థితికి చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈసారి ఎక్కువ లాభాలను అందుకుంటారు. ఏ ప్రాజెక్టు తలపెట్టినా విజయం తథ్యం. ఈ రాశివారు మంచి ఫలితాలను సాధిస్తారు.