Gangamma Jatara History : గంగ జాతరలో ఏలాంటి వేషాలు వేస్తారు.!? ఆ మట్టి ఎందుకు తెచ్చుకుంటారు.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangamma Jatara History : గంగ జాతరలో ఏలాంటి వేషాలు వేస్తారు.!? ఆ మట్టి ఎందుకు తెచ్చుకుంటారు.!?

 Authored By prabhas | The Telugu News | Updated on :26 July 2022,8:00 pm

Gangamma Jatara History : మీరు ఎప్పుడైనా దేవుళ్లను బూతులు తిట్టారా.!? అవును మీరు విన్నది నిజమే.!? కానీ ఇది నిజంగా తిరుపతి గంగ జాతరలో జరుగుతుంది.. అలా ఒక దేవతను బూతులు తిట్టడానికి గల కారణాలు ఏంటి.!? ఆ జాతర సమయంలో ఎందుకు వేషాలు వేసుకుంటారు..!? ఇక్కడ మగవాళ్ళు ఆడవారిలాగా.. ఆడవారు మగవారిలా వేషాలు వేస్తుంటారు.. అలా ఎందుకు చేస్తారు.!? అక్కడి భక్తులే ఆ దేవత చెంప కుడా నరుకుతారు.. వినడానికి చాలా వింతగా ఉన్నా ఈ ఆసక్తికరమైన విశేషాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..! మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. గ్రామ దేవతలు ప్రతి ఊరిలోనూ ఉంటారు.. అలా ఈ రోజు మనం తిరపతి గ్రామ దేవత గంగ జాతర గురించి తెలుసుకుందాం.. తాళ్లపాక గంగమ్మ కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో ఓ మర్రి చెట్టును ఆశ్రయించుకుని రాక్షస రూపంలో ఉండేది..

ఒకరోజు రామానుజాచార్యులు ఆ మరి చెట్టు కింద నిద్రిస్తుండగా.. బలవంతంగా రామానుజాచార్యుల మీదకు దూకి ఆయన్ని మింగేయాలని చూస్తుంది వెంటనే నిద్ర మేల్కొన్న రామానుజాచార్యులు మంత్రించిన అక్షింతలను ఆమె మీద వేస్తూ ఆమెను చిన్నపిల్లగా మారుస్తారు.. ఆ చిన్న పిల్లను అయినా తిరుపతి దాకా తీసుకువచ్చి చాటు మండపం దగ్గర వదిలి వెళతారు ఆమె ఆ చుట్టుపక్కల ఉన్న అవిలాన గ్రామంలోని ఒక రెడ్డి ఇంటిలోకి వెళ్తుంది.. ఎవరు అని అడిగితే ఆ బిడ్డ సమాధానం ఇవ్వకపోవడంతో.. కష్టంలో ఉన్న ఆ బిడ్డను చేరదీసి వాళ్లే పెంచుకుంటారు.. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ బావిలో నీటిని చేదుతుండగా పాలగాడు ఆమెను చూస్తాడు.. ఆ పాలగాడు చాలా నీచమైన వాడు అతనికి అమ్మాయిలు అంటే కామ దహనంతో రగిలిపోతూ ఉంటాడు.. పెళ్లి ఎవరితో జరిగినా కానీ శోభనం మాత్రం అతనితోనే జరగాలి అంటాడు ఆ నీచుడు.. ఆ వికృత చేష్టలకు ఎవరైనా అడ్డు వస్తే మాత్రం వారిని చంపేస్తాడు..

Tirumala Tirupati Gangamma Jatara Unknown old History

Tirumala Tirupati Gangamma Jatara Unknown old History

ఒకరోజు ఆవిలానా మీదగా వెళుతున్న ఆ పాలకుడి కంట్లో గంగమ్మ పడుతుంది.. ఆ పాలగాడి గురించి తెలుసుకున్న గంగమ్మ అతని మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.. గంగమ్మ శక్తి స్వరూపరాలోని తెలుసుకున్న ఆ పాలగాడు పారిపోయి ఎక్కడో దాకుంటాడు దాంతో గంగమ్మ మారువేషాలు వేసుకుంటూ తిరగడం మొదలు పెడుతుంది ఆ పాల గాడిని రెచ్చగొట్టడానికి పచ్చి బూతులు తిడుతూ వీధులు, కొండలు, గుట్టలు, వాగు, వంక అన్ని తిరుగుతూ ఉండేది.. అలా గంగమ్మ ఆ పాలగాడిని పట్టుకోవడం కోసం రకరకాల వేషధారణ వేస్టు బూతులు తిడుతుంది కాబట్టి జాతర మొదటి మూడు రోజులు ప్రజలు పచ్చి బూతులు తిడతారు.. ఈ విషయాలను మీరు ఆధునిక కోణంలో కాకుండా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారంగా భావించి చూడండి..ఈ బూతులు తిట్టడం గనుక అట్టడుగు వర్గాల వారు తమ పై వారిని తిట్టాలనే ఆలోచన ఉంటుంది. నిజానికి ఉన్నత వర్గాల వారిని ఈ జాతరలో తిట్టే అవకాశాన్ని కల్పించారు..

ఈ జాతరలో యజమానిని కూలివాడు తిట్టినా కూడా అదే అమ్మవారికి ప్రీతికరమైనది అని భావిస్తారు మరి కొంతమందికి బూతులు కోరిక ఉంటుంది అటువంటివారు ఈ జాతరలో బూతులు తిట్టి తమ కోరిక నెరవేర్చుకుంటారు మరి కొంతమంది అడిగిమరీ బూతులు తిట్టించుకుని నవ్వుకుంటూ వెళ్లిపోతారు పూర్వం మన ఆలయాలలో సంభోగ పూజలు జరిగేయని.. అనేక చోట్ల బూతు ఉత్సవాలు కూడా జరిపించే వారిని ఆధారాలు కూడా ఉన్నాయి.. అంతెందుకు పూరి జగన్నాథుడి రథోత్సవంలో ఆగిపోయినప్పుడు కూడా జనాలు పచ్చి బూతులు తిట్టుకుంటరు.. తిరుపతి గంగమ్మ జాతర బైరాగి వేషంతో మొదలవుతుంది.. ఆ తరువాత బండవేషం, నోటి వేషం ఉంటుంది.. గంగమ్మ అలా వేషాలు మారుస్తూ చివరిగా దోరవేషంలో వచ్చి పాల గాడిని పిలవగా భావించి బయటికి వస్తాడు. దాంతో గంగమ్మ ఒక్క ఉదుటన ఆ పాల గాడిని నరికి వేస్తుంది. దాంతో తిరుపతి ఆడపిల్లలకు పట్టిన పీడ మొత్తం పోతుంది ఆ తరువాత అమ్మవారు మాతంగి వేషం వేస్తారు.

ఇక చివరి రోజున జాతర అంగరంగ వైభవంగా చేస్తారు. తిరుపతి మొత్తం ఎక్కడ చూసినా జాతర సంబరాలతో హోరెత్తుతుంది. ఒకప్పుడు ఈ జాతరలో మేకపోతులను బలి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బలి ఇవ్వటాన్ని ఆపేశారు.. ఇక జాతరలో ప్రధానంగా బైరాగి వేషం, బండవేషం, తోటివేషం, దొర వేషం, మాతంగి వేషం, గొల్లవేషం, చెప్పరాదు వేషం, పేరంటాలు వేషం, దాస్తీక పద్దుల వారి వేషం, నూకోచీపతుల వారి వేషం, గారడి విద్యల వేషం.. ఇలాంటి వేషాలు వేసుకుని ముందుగా వేషాలమ్మ గుడికి వెళ్లి ఆ తరువాత గంగమ్మ గుడికి వెళ్తారు.. అమ్మవారికి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.. ఈ జాతరలో ఇంకొక వింత ఏమిటంటే .. ఈ జాతరలో ఆఖరిగా గంగమ్మ చెంప నరుకుతారు.. తాతయ్య గుట్ట గంగమ్మ ముందు ఏడు నుంచి ఎనిమిది అడుగులు ఎత్తు ఉండే పెద్ద భయంకరమైన గంగమ్మ బొమ్మలు కొయ్యతో, వరిగడ్డితో, బంకమట్టితో వివిధ అలంకారాలు చేస్తారు..

ఈ గంగమ్మకు పూజలు చేశాక పేరంటాల వేషం వచ్చి గంగమ్మ చెంపను నరికేస్తుంది.. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం గుడి ప్రాంగణంలో వేల మంది భక్తులు కిక్కిరిసిపోతారు.. గంగమ్మ చెంప నరికిన తర్వాత ఆ బంక మట్టి కోసం భక్తులు తొక్కిసలాడుకుంటూ ఉంటారు.. ఎనిమిది అడుగుల విగ్రహంలో గోరంత మట్టి కూడా మిగల్చకుండా తీసుకొని వెళ్తారు అంటే.. ఆ బంక మట్టిని భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.. ఈ విశేషాలు కాస్త వింతగా అనిపించినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది తెలియజేస్తుంది.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఆనాటి ఆనవాళ్లు ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటాయి.. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది