Vastu Doshas : వాస్తు దోషాలు పోవాలంటే.. మీ ఇంట్లో ఈ రెండు పక్షుల చిత్రపటాలను పెట్టుకోండి…!
ప్రధానాంశాలు:
Vastu Doshas : వాస్తు దోషాలు పోవాలంటే.. మీ ఇంట్లో ఈ రెండు పక్షుల చిత్రపటాలను పెట్టుకోండి...!
Vastu Doshas : చాలామంది తమ ఇంటిని అందంగా ఆకర్షణీయంగా మార్చడానికి ఇంట్లో రకరకాల ఫోటోలు బొమ్మలు ఫ్లవర్ ఫ్లవర్ వాస్ లను వంటివి పెడుతుంటారు. అదేవిధంగా వాస్తు దోషాలు తొలగిపోవడం కోసం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చి పెడుతుంటారు. వీటి వల్ల ఇల్లు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇక వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో నీలకంఠ నెమలి ఫోటోలను పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీటి వలన ఇంట్లో ప్రతికూలన శక్తి తగ్గిపోవడంతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుంది.
Vastu Doshas నీలకంఠ పక్షి చిత్రపటం వల్ల కలిగే లాభాలు..
ఇంట్లో నీలకంఠ పక్ష చిత్రపటాన్ని పెట్టడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఐశ్వర్యంతో పాటు శాంతిని చిగురింప చేస్తుందట. ఈ పక్షి సాక్షాత్తు ఆ నీలకంఠుడికే ప్రీతికరమైనది. కాబట్టి ఆ పక్షి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Vastu Doshas : నెమలి ఫోటో పెట్టడం వల్ల కలిగే లాభాలు.
నెమలి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో సమతుల్యత చిగురిస్తుందని చెబుతారు. ఇక నెమలి చిత్రపటం ఉండటం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించడంతో పాటుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా భార్య భర్తల మధ్య ప్రేమ బలపడుతుంది.
ఏ దిశలో ఉంచాలంటే : నీలకంఠ పక్షి మరియు నెమలి చిత్రపటాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలంటే పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో వీటిని ఉంచండి. అంతేకాకుండా లివింగ్ రూమ్ లో పెట్టాలి అనుకుంటే ఇతర దిశలో ఉంచండి. దీనివల్ల ఇంట్లో శాంతి శ్రేయస్సు చేకూరుతుంది. అలాగే ఆగ్నేయ దిశలో పెట్టిన సత్ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా పడకగదిలోని ఆగ్నేయ గోడపై పెట్టడం వల్ల భార్య భర్తల మధ్య సంబంధం పెరుగుతుంది. అయితే ఈ ఫోటోలు పెట్టే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఆ ఫోటోలు అస్వష్టంగా లేదా పాతబడి ఉండకూడదు. అలాగే వంటగది మరియు బాత్రూం లేదా మెట్ల దగ్గర వాటిని అసలు ఉంచకూడదు. ఇంట్లోకి సానుకూల శక్తి కలిగేలా చిత్రపటాన్ని ఎప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.